
ఏఎన్‌ఎం, అకౌంటెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు
భువనగిరి : జిల్లాలోని కస్తూరిబాగాంధీ విద్యాలయాల్లో అకౌంటెంట్, ఏఎన్‌ఎం పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ ఏడీ ప్రశాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏఎన్‌ఎం సంబంధిత కోర్సులో శిక్షణ పూర్తి చేయడంతో పాటు ఇంటర్ విద్యార్హత, అకౌంటెంట్ పోస్టుకు బీకాం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండలన్నారు. దరఖాస్తులను ఈ నెల 22లోపు అందజేయాలన్నారు. వివరాలకు 9441189894ను సంప్రదించాలని కోరారు.
అర్బన్ రెసిడెన్సియల్ స్కూల్‌లో..
చందేపల్లి పరిధిలోని అర్బన్ రెసిడెన్సియల్ స్కూల్‌లో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు విద్యాశాఖ ఏడీ ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. అటెండర్, డే, నైట్ వాచ్‌మన్లు, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. దరఖాస్తులను ఈనెల 22వ తేదీ లోపు డీఈఓ కార్యాలయంలో అందజేయాలని కోరారు. వివరాలకు 9441189894 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
బీజేపీ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
భువనగిరి: బీజేపీ జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారికి నియామక పత్రాలు అందజేసి సన్మానించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా వేముల నరేష్, జైనపల్లి శ్యాంసుందర్‌రెడ్డి, పట్నం శ్రీనివాస్, గూడూరు నరోత్తంరెడ్డి, పన్నాల చంద్రశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా కొప్పుల యాదిరెడ్డి, చందా మహేందర్ గుప్తా, కాదూరి అచ్చయ్య, కార్యదర్శులుగా వైజయంతి, కృష్ణ, మల్లారెడ్డి, మేడి కోటేష్, లక్ష్మీనారాయణ, కోశాధికారులుగా సోమ నరసయ్య, జిల్లా కార్యాలయ కార్యదర్శిగా మంగు నర్సింగ్‌రావు, జిల్లా ఐటీ ఇన్‌చార్జి వెంకటేష్, మీడియా ఇన్‌చార్జి రామకృష్ణ,సోషల్ మీడియా కో కన్వీనర్‌గా సుధ, ఉదయ్‌కిరణ్ నియమితులయ్యారు. నూతన కార్యవార్గన్ని జిల్లా అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, నాయకులు జగన్మోహన్‌రెడ్డి తదితరులు అభినందించారు.
ప్రజా సమస్యలపై పోరాటాలు
భువనగిరిటౌన్ : ప్రజా సమస్యలపై వారం రోజుల పాటు సీసీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ తెలిపారు. శుక్రవారం భువనగిరిలోని సీపీఎం కార్యాలయంలో కల్లూరి మల్లేశం అధ్యక్షతన జరిగిన సెక్రటేరియట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకు నోచడం లేదన్నారు. మూసీ పునరుజ్జీవం, బస్వాపురం గంధమల్ల, దేవాదుల ప్రాజెక్టుల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడిందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈనెల 22 23 24 25 తేదీల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట నిరసనలు, 28 29 30 తేదీల్లో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, మాటూరు బాలరాజు, దాసరి పాండు, జెల్లెల పెంటయ్య, బూరుగు కష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.
పల్లెకవిత–విద్యాభవిత పుస్తకావిష్కరణ
ఆలేరు: పట్టణంలోని సిల్క్‌నగర్‌కు చెందిన కవి ఎస్‌కే జానిమియా రచించిన ‘పల్లె కవిత–విద్యా భవిత’ పుస్తకాన్ని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో టీసీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి తదితరులు శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం హాజరుశాతం ఎక్కువ ఉన్న విద్యార్థులు, ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు ఎన్‌సీసీ కేడెట్‌లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం మంజుల, ఎన్‌సీసీ అధికారి దూడల వెంకటేష్, ఉపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి, సైదులు,మల్లేష్, మేఘరాజు పాల్గొన్నారు.

ఏఎన్‌ఎం, అకౌంటెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు