‘స్థానికం’ తర్వాతే యువ వికాసం!
సాక్షి,యాదాద్రి: రాజీవ్ యువ వికాసం రుణాల మంజూరు ఆలస్యం కానుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించి ఈ నెల 9వరకు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేయాల్సి ఉంది. కానీ, సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దరఖాస్తుదారుల్లో నిరాశ నెలకొంది.
39,141 దరఖాస్తులు
రాజీవ్ యువ వికాసం పథకం కింద జిల్లాకు 10,582 యూనిట్లు మంజూరయ్యాయి. ఇందుకోసం 39,141 వేలు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రూ.50వేల నుంచి రూ.లక్ష, రూ.2లక్షల రుణాలకు దరఖాస్తులు తక్కువ రాగా రూ.4 లక్షల రుణా లకు భారీ స్పందన లభించింది. బీసీ కార్పొరేషన్ కింద 4,294 యూనిట్లకు 23,578 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్టీ 3,644 యూనిట్లకు 10,209 మంది, ఎస్టీ 1,250 యూనిట్లకు 2,536, ఈబీసీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 1,044 యూనిట్లకు గాను 2,577 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలుత రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు యూనిట్‌లను గ్రౌండింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మే రకు బ్యాంకుల వారీగా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి లబ్ధిదారుల జాబితా కూడా సిద్ధం చేశారు. యూనిట్లు చేతికందుతాయనుకున్న సమయంలో ప్రభుత్వం సాంకేతిక కారణాలు చూపి వాయిదా వేసింది. దీంతో రుణాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అందరికీ ఒకేసారి పంపిణీ!
తొలి విడతలో కొందరికే యూనిట్‌లు కేటాయించడం వల్ల యువతలో వ్యతిరేకత ఏర్పడుతుందన్న భావనతో ప్రభుత్వం ప్రొసీడింగ్స్ పంపిణీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు వ్యతిరేకత కూడగట్టుకోవద్దని, ఎన్నికల తరువాత దరఖాస్తుదారులందరికీ ఒకేసారి యూనిట్లు మంజూరు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా నిలిచిన ప్రక్రియ
ఫ సాంకేతిక కారణాలతో వాయిదా వేసిన ప్రభుత్వం
ఫ కొందరికే ఇవ్వడం వల్ల వ్యతిరేకత వస్తుందన్న భయం
ఫ అందరికీ ఒకేసారి ఇవ్వాలన్న ఆలోచన
ఫ యువతకు తప్పని ఎదురుచూపులు
దరఖాస్తులు ఇలా..
ఎస్సీ కార్పొరేషన్ 3,644
ఎస్టీ కార్పొరేషన్ 1,250
బీసీ కార్పొరేషన్ 4,295
ఈబీసీ 1,044
ముస్లిం మైనార్టీ 269
క్రిస్టియన్ మైనార్టీ 80
మొత్తం యూనిట్లు 10,582


