మునుగోడు: మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామానికి ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీత వచ్చారు. తమ సమీప బంధువు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెదిర మధుసూదన్‌రెడ్డి దశ దినకర్మకు సీఎం సతీమణి గీత, ఆమె తల్లిదండ్రులు సూదిని పద్మారెడ్డి, పారిజాత హాజరై మధుసూదన్‌రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో పాటు రాష్ట్ర లోకాయుక్త చైర్మన్ జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, నిజమాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కై లాస్‌నేత, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు హాజరై మధుసూదన్‌రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు.
ఫ సమీప బంధువు దశదినకర్మలో పాల్గొన్న గీత


