అమృత్‌ పనుల్లో వేగం | - | Sakshi
Sakshi News home page

అమృత్‌ పనుల్లో వేగం

Dec 25 2025 10:19 AM | Updated on Dec 25 2025 10:19 AM

అమృత్‌ పనుల్లో వేగం

అమృత్‌ పనుల్లో వేగం

మార్చిలోగా పూర్తవుతాయి

సాక్షి, యాదాద్రి: మున్సిపాలిటీల్లో ప్రజలకు మంచినీటి వసతి కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అమృత్‌ 2.0 పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2026 మార్చి వరకు గడువు ఉండగా ఆ దిశగా పనులు పూర్తిచేయాలని జిల్లా యంత్రాంగం ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించింది. గతేడాది అమృత్‌ 2.0 పథకానికి ఆరు మున్సిపాలిటీలకు రూ. 121.3 కోట్ల నిధులు మంజూరు చేసింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మున్సిపాలిటీల్లో అదనంగా అంతర్గత పైప్‌లైన్లు, ట్యాంకులు నిర్మిస్తున్నారు.

మున్సిపాలిటీల్లో ఇలా..

ఫ భువనగిరి మున్సిపాలిటీలో రూ.21.80 కోట్ల నిధులతో అమృత్‌ 2.0 పనులు ప్రారంభించారు. 19 కిలోమీటర్ల మేర మంచినీటి పైపులైన్లు వేసేందుకు ప్రతిపాదన సిద్ధం చేయగా.. 10 కిలోమీటర్లు మేర పనులు పూర్తి చేశారు. ఇక రాయిగిరి, డబుల్‌బెడ్‌రూం వద్ద, ప్రగతినగర్‌లో 15లక్షల కిలోలీటర్లు సామర్థ్యం గల ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు నిర్మిస్తున్నారు. ప్రగతి నగర్‌లో ఉన్న ట్యాంకు పనులు స్లాబ్‌ దశకు చేరుకున్నాయి. రాయిగిరిలో 3లక్షల కిలోలీటర్లు ట్యాంకు భీమ్‌ దశలో ఉన్నాయి.

ఫ ఆలేరు మున్సిపాలిటీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద 1000కేఎల్‌, పాత గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద 700 కేఎల్‌ సామర్థ్యంతో రెండు ట్యాంకులు నిర్మిస్తున్నారు. 4 కిలోమీటర్ల పొడవు ప్రధాన పైప్‌లైన్‌, 9 అంతర్గత పైప్‌లైన్ల పనులు జరుగుతున్నాయి.

ఫ చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలో 24 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం గల ట్యాంకులు చౌటుప్పల్‌లో రెండు, తంగడపల్లిలో ఒకటి, లక్కారంలో ఒకటి నిర్మిస్తున్నారు. తంగడిపల్లి గ్రామంలోని బీసీ కాలనీలో నిర్మిస్తున్న ట్యాంక్‌ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ట్యాంకులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న నాలుగు ట్యాంకుల పరిధిలో 29 కిలోమీటర్ల మేరకు పైప్‌ లైన్‌ వేయాల్సి ఉంది. కొన్ని కాలనీల్లో సు మారు నాలుగు, ఐదు కిలోమీటర్ల మేర పైప్‌లైన్లు వేశారు.

ఫ భూదానపోచంపల్లి మున్సిపాలిటీలో 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్‌ నిర్మాణం చేపట్టారు. ఇప్పటివరకు మూడవ బ్రెస్‌ బీమ్‌ పనులు నడుస్తున్నాయి. 42 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ వేయాల్సి ఉండగా వెంకటరమణ కాలనీ, రాంనగర్‌ కాలనీ, పద్మానగర్‌, జెవీ కాలనీలలో 12 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ వేశారు.

ఫ యాదగిరిగుట్ట పట్టణంలో అంగడి బజార్‌, కొత్త గుండ్లపల్లిలో 500 కేఎల్‌, గణేష్‌ నగర్‌లో 1200 కేఎల్‌ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. అంగడి బజార్‌, కొత్త గుండ్లపల్లిలో 80శాలానికి పైగా అంటే నాల్గవ అంతస్తులో ట్యాంక్‌ స్లాబ్‌ పనులు జరుగుతున్నాయి. గణేష్‌ నగర్‌లో రెండవ దశ పనులు చేస్తున్నారు. స్థల సేకరణలో ఇబ్బందులు ఉండటంతో గణేష్‌ నగర్‌లో పనులు ఆలస్యం జరిగింది. పైప్‌లైన్లు 15 కిలోమీటర్ల మేర వేశారు. 60 కిలోమీటర్లు వేయాల్సి ఉంది.

ఫ మోత్కూర్‌ మున్సిపాలిటీలోని జూనియర్‌ కళాశాలలో చేపట్టిన ట్యాంక్‌ నిర్మాణ పనులు థర్డ్‌ లెవెల్‌లో ఉన్నాయి. జెడ్పీ పాఠశాలలో ఫస్ట్‌ లెవెల్‌ ట్యాంక్‌ పనులు జరుగుతున్నాయి. నాలుగున్నర కిలోమీటర్ల మెయిన్‌ పైప్‌ లైనన్‌కు 3 కిలోమీటర్లు పైపులైన్‌ పూర్తయింది. ఐదున్నర కిలోమీటర్ల ఇంటర్నల్‌ పైప్‌లైన్‌ పనులకు కిలోమీటరు మేర పూర్తయ్యాయి. సుమారు 700 నల్లా కనెక్షన్ల పనులు చేయాల్సి ఉంది. .

అమృత్‌ 2.0 పథకంలో చేపట్టిన పనులు మార్చిలోగా పూర్తవుతాయి. గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చాం. వచ్చే నెలలో కొన్ని ట్యాంకులు పూర్తి కానున్నాయి. పైప్‌లైన్‌ పనులు కూడా పూర్తి చేయాలని అధికారులకు సూచించాం.

– భాస్కర్‌రావు, అదనపు కలెక్టర్‌

ఫ ముమ్మరంగా సాగుతున్న ట్యాంకుల నిర్మాణం, పైప్‌లైన్‌ పనులు

ఫ మున్సిపాలిటీల్లో గతేడాది

మంజూరైన రూ. 121.3 కోట్ల నిధులు

ఫ గడువులోగా పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement