నేను తెలంగాణ ప్రజల బాణాన్ని
ఫ బీజేపీకి సీఎం రేవంత్‌రెడ్డికి
అంతర్గత సంబంధాలు
ఫ బీఆర్‌ఎస్ నుంచి నన్ను ఎందుకు
సస్పెండ్ చేశారో తెలియదు
ఫ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
కల్వకుంట్ల కవిత
సాక్షి, యాదాద్రి : శ్రీనేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు.. నేను తెలంగాణ ప్రజల బాణాన్ని. నన్ను ఎవరో ఆపరేట్ చేసే సీన్ లేదుశ్రీ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్‌ఎస్‌లోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. 2029లో ఎన్నికలు వస్తాయని భావిస్తున్నా. అప్పుడు బరిలో ఉంటామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నుంచి నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో కారణం చెప్పలేదని, నాకు ఇప్పటికీ తెలియదన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన నోటీసులు ఊహాజనితమే. దానిపై నేను మాట్లాడలేన్నారు. రేవంత్‌రెడ్డి అంటేనే ఆర్‌ఎస్‌ఎస్ సీఎం అని, అంతర్గతంగా బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇబ్బందిపడిన ప్రజలకు తాను క్షమాపణ చెబుతున్నానన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో జరిగిన తప్పులకు ఆ పార్టీలో ఉన్నప్పుడు తాను కూడా భాగస్వామినేని ఆమె అన్నారు. తనను నిజామాబాద్ వరకే పరిమితం చేశారని దీంతో రాష్ట్రంలో రైతులకు బేడీలు వేసిన విషయం కూడా తన దృష్టికి రాలేదన్నారు రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కోసం ఆందోళన చేస్తామని, హైదరాబాద్‌లో జనవరి 8న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
భువనగిరి ఖిలా పరిశీలన
భువనగిరి: జాగృతి జనం బాటలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భువనగిరి ఖిలాను సందర్శించి ఖిలా ప్రాముఖ్యత, అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని స్వర్ణకారుల వీధిలో పర్యటించారు. బీబీనగర్ మండలంలోని జియాపల్లి గ్రామంలో క్రషర్ల వల్ల దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.


