ఉల్లంఘిస్తే ఊరుకోం!
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. మద్యం సేవించి వాహనాలు నడపొద్దు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి. తల్లిదండ్రులు చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు. రాంగ్ రూట్ ప్రయాణాలు ప్రాణాలకే ముప్పు. రూల్స్‌ను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.
– కృష్ణ, ట్రాఫిక్ సీఐ, యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట రూరల్: రోడ్డు నిబంధనలు పాటించని వాహనదారులపై యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ప్రమాదాల నివారణకు ప్రయత్నిస్తూనే, రూల్స్ ఉల్లంఘించి, ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపిన వారిపై చలానాలు విధిస్తున్నారు. యాదగిరిగుట్ట పట్టణ పరిధితో పాటుగా, హైదరాబాద్– వరంగల్ జాతీయ ప్రధాన రహదారి ఎన్‌హెచ్ 163లో నిరంతరం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. అయితే నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు, కౌన్సిలింగ్ ఇస్తున్నా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదని పోలీసులు చెబుతున్నారు.
ఏడాదిలో రూ.143,50,200 జరిమానాలు
యాదగిరిగుట్ట, తుర్కపల్లి రాజాపేట, ఆలేరు, మోటకొండూరు, గుండాల మండలాల పరిధిలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను పోలీసులు ఈ ఏడాదిలో 84,200 కేసులు నమోదు చేశారు. వీరికి రూ.1,43,50,200 జరిమానాలు విధించారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన వారికి రూ.44,33,300, సీట్ బెల్టు ధరించని వారికి రూ. 30,21,300, ట్రిపుల్ రైడింగ్‌లో వెళ్లిన వారికి రూ,12,49,200, ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపిన వారికి రూ.8,21,000, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి రూ.7,38,500, వాహనాలకు నంబర్ ప్లేట్‌లు సరిగ్గా లేని వారికి రూ. 9,27,600, లైసెన్స్‌లు క్యారీ చేయని వారికి రూ. 2,50,200, యూనిఫామ్ ధరించని ఆటోవాలాలకు రూ,4,46,000, రాంగ్ పార్కింగ్‌లో వాహనాలు నిలిపిన వారికి రూ.4,95,700, ప్రమాదకరంగా వాహనాలు నడిపిన వారికి రూ.1,98,000, సౌండ్ పొల్యూషన్ వాహనాలకు రూ.1,67,000, వాహనాలకు బ్లాక్ ఫిలిమ్ ఏర్పాటు చేసినందుకు రూ.3,92,700 విధించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. నిత్యం ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నా, తనిఖీలు చేస్తున్నా, జరిమానాలు విధిస్తున్నా మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిలో మాత్రం మార్పు రావడం లేదు. ఈ ఏడాదిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 847 మంది పట్టుబడ్డారు. వీరందరిని ఫస్ట్ క్లాస్ కోర్డులో హాజరుపరచగా, రూ.16,94,000 జరిమానాలు విధించింది.
ఫ రోడ్డు నిబంధనలు పాటించని
వారిపై ట్రాఫిక్ పోలీసుల కొరడా
ఫ యాదగిరిగుట్ట పరిధిలోని
ఆరు మండలాల్లో ఏడాదిలో 84,200 కేసులు నమోదు
ఫ రూ.1,43,50,200 జరిమానాలు
ఉల్లంఘిస్తే ఊరుకోం!


