రేపు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా
భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణంలోని గంజ్, కన్యకా పరమేశ్వర గుడి పక్కన ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆధ్వర్యంలో శుక్రవారం ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఆహార పరిరక్షణ విభాగం అధికారి స్వాతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని రకాల ఆహార వ్యాపారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పొందాలని పేర్కొన్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, బేకరీలు, కిరాణా దుకాణాలు, మాంసం, చేపల విక్రయ కేంద్రాలు, పాలు – పాల ఉత్పత్తి వ్యాపారులు, ఫుడ్ స్టాల్స్, వీధి ఆహార విక్రేతలు మేళాకు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.
శాస్త్రోక్తంగా
ధనుర్మాస ఉత్సవాలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. బుధవారం 9వ రోజు గోదాదేవి అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించారు.
యాదగిరీశుడికి
విశేష ఆరాధనలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో విశేష ఆరాధనలు కొనసాగాయి. బుధవారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన చేశారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలు నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు భక్తులచే జరిపించారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్
విడుదల చేయాలి
భువనగిరిటౌన్ : రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట రిటైర్డ్ ఉద్యోగులు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్చి 2024 నుంచి నేటి వరకు రిటైర్డ్ అయిన వారికి ప్రభుత్వ బకాయిలు చెల్లించడంతో జాప్యం చేస్తోందన్నారు. జిల్లా లో అన్ని విభాగాల నుంచి సుమారు 300 మందికి పైగా ఉద్యోగ విరమణ చేశారని, వారికి ఇప్పటివరకు బెనిఫిట్స్ రాలేదన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాల్గొన్నారు.
పోలీస్ క్రికెట్ టోర్నీలో నల్లగొండ జట్టు విజయం
రామగిరి(నల్లగొండ) : మండలంలోని అన్నెపర్తి బెటాలియన్‌లో బుధవారం నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డీఎస్పీ పరిధిలో మూడు, ఏఆర్, డీపీఓ జట్లు మొత్తం ఐదు జట్లకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీల్లో నల్లగొండ జట్టు విన్నర్, ఏఆర్ జట్టు రన్నర్‌గా నిలిచాయి. అనంతరం విన్నర్ జట్టుకు ఏఎస్పీ జి.రమేష్ టోర్నీ కప్ అందజేశారు.
రేపు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా


