తరలని ధాన్యం.. తడిపిన వర్షం
భువనగిరిటౌన్ : జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఆరబెట్టిన ధాన్యంతో పాటు కాంటా వేసి మిల్లులకు తరలించడానికి సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు తడిసిముద్దయ్యాయి. ఆరబెట్టుకునే అవకాశం కూడా లేకుండా వెనువెంటనే వర్షాలు కురుస్తుండటం రైతులను తీవ్రనష్టాలకు గురి చేస్తున్నాయి. రాగల ఐదురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురి సే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు.
బుధవారం రాత్రి నుంచి గురువారం
తెల్లవారుజాము వరకు వర్షపాతం
యాదగిరిగుట్టలో 50, వలిగొండ 45, బొమ్మలరామారం 44, మోటకొండూరు 39, రాజాపేట 32, భువనగిరి 32, తుర్కపల్లి 29, ఆత్మకూర్ 27, ఆలేరు 27, భూదాన్‌పోచంపల్లి 21, మోత్కూరు మండలంలో 16 మి.మీ వర్షపాతం నమోదైంది.
ఫ ధాన్యం ఎగుమతిలో జాప్యం
ఫ అకాల వర్షాలకు తడుస్తున్న వడ్లు
ఫ నష్టపోతున్న రైతులు


