రైతుల ముంగిటకు శాస్త్రవేత్తలు
ఫ పంటల సాగు విధానాలపై అవగాహన
ఫ నేటి నుంచి జూన్ 13 వరకు సదస్సులు
ఫ కార్యాచరణ సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ
సద్వినియోగం చేసుకోవాలి
చౌటుప్పల్, చౌటుప్పల్ రూరల్ : రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ పరిశోధన సంస్థ సంచాలకుడు గాదె శ్రీనివాస్, చౌటుప్పల్ మండల వ్యవసాయాధికారి ముత్యాల నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.చౌటుప్పల్ డివిజన్ పరి ధిలోని చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, భూదాన్‌పోచంపల్లి మండలాల్లోని 42 గ్రామాల్లో నేటినుంచి ఈనెల 13వ తేదీ వరకు సదస్సులు ఉంటాయన్నారు.రైతు వేదికలు, పంచాయతీ కార్యాలయాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మున్సిపల్ వార్డుల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
చౌటుప్పల్ మండలంలో ఇలా..
5న దండుమల్కాపురం, 8న చిన్నకొండూర్, 13న పెద్దకొండూర్, 16న తంగడపల్లి, 20న డి.నాగారం, 22న జైకేసారం, 24న మసీదుగూడెం, 29న ఎస్.లింగోటం, 30న ఎల్లగిరి, జూన్ 3న మందోళ్లగూడెం, 5న పంతంగి, 10న చౌటుప్పల్, 12న లింగోజిగూడెంలో సదస్సులు ఉంటాయి.
త్రిపురారం : పంటల సాగులో అవలంభించాల్సిన విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘రైతుల ముంగిటకు వ్యవసాయ శాస్త్రవేత్తలు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాయి. జిల్లాలో సోమవారం నుంచి జూన్ 13వ తేదీ వరకు గ్రామాల్లో సదస్సులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించనున్నారు.
వీటిపై అవగాహన : భూసార పరీక్షలు, ఎరువులు, యూరియా వాడకాన్ని తగ్గించుకోవడం, చీడపీడల నివారణ మార్గాలు, విత్తానాభివృద్ధి, నీటి యాజమాన్య పద్ధతులు, సమీకృత, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, యాంత్రీకరణ, వ్యవసాయ శాఖ పథకాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు వివరిస్తారు.


