గుట్ట ఆలయ ఈఓగా వెంకట్రావ్
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ భాస్కర్‌రావు బదిలీ అ య్యారు. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి ఎస్.వెంకట్రావ్ నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వెంకట్రావ్ గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా జేసీగా, భువనగిరి జిల్లా డీఆర్‌డీఏ పీడీగా పనిచేశారు. ఆతరువాత మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లారు.
మొదటిసారి ఐఏఎస్ అధికారి
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఐఏఎస్ అధికారిని నియమించడం ఇదే మొదటిసారి. గతంలో అసిస్టెంట్ కమిషనర్ నుంచి డిప్యూటీ కమిషనర్, రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్‌జేసీ) హోదాలోనే దేవాదాయశాఖ నుంచి అధికారులను నియమించారు. వెంకట్రావ్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ డైరెక్టర్, జాయింట్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనను దేవాదాయశాఖ డైరెక్టర్‌గా బదిలీ చేసి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఈఓగా నియమించారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
14 నెలల్లో అనేక సంస్కరణలు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓగా భాస్కర్‌రావు గత ఏడాది మార్చి 16వ తేదీన బాధ్యతలు చేపట్టారు. 14 నెలల కాలంలో అనేక సంస్కరణలు తీసుకురావడంతో పాటు భక్తులకు సౌకర్యాలు మెరుగుపర్చారు.
–దివ్య విమాన గోపురానికి స్వర్ణతాపడం పనులు పూర్తి చేయించారు. 40 ఏళ్ల తరువాత 31వ మధురకవి రామానుజ జీయర్‌స్వామిని తీసుకువచ్చి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా స్వర్ణవిమాన గోపురాన్ని ఆవిష్కరింపజేశారు.
● కొండపైన భక్తులు నిద్ర చేసేందుకు డార్మిటరీ హాల్, వేసవిలో ఎండకు ఇబ్బందులు పడకుండా జర్మనీ హంగర్ టెంట్‌లు ఏర్పాటు.
● కొండపైన సాంస్కృతిక వేదిక, రూ.150 టికెట్ క్యూలైన్ ఏర్పాటు.
● బ్రేక్ దర్శనం, వివిధ పూజాధి కార్యక్రమాల్లో భక్తులు సంప్రదాయ దుస్తువులు ధరించాలనే నిబంధన అమలు.
● గిరి ప్రదక్షిణ మార్గంలో ఫుట్‌ఫాత్ టైల్స్, విద్యుత్ దీపాల ఏర్పాటు. గిరిప్రదక్షిణ గురించి వివిధ రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం. స్వాతి నక్షత్రం రోజు వెయ్యి మంది గిరి ప్రదక్షిణలో పాల్గొంటుండగా.. ఈఓ కృషి తోఆ సంఖ్య 6నుంచి 8వేలకు చేరింది.
● శ్రీస్వామి వారి కైంకర్యాలు భక్తులు వీక్షించేలా ఆలయ మాడ వీధుల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు.
● భక్తులు శ్రీస్వామి వారిని కనులారా వీక్షించి దర్శనం చేసుకునేలా గర్భాలయం ముందు ర్యాంప్ నిర్మాణం.
● భక్తులకు శఠారీ, కుంకుమ పెట్టే పద్ధతులు అమలు.
● కొండపై ఉన్న విష్ణు పుష్కరిణి తిరిగి ప్రారంభం.
● అవకతవకలకు తావులేకుండా ప్రసాద విక్రయశాలలో ఆన్‌లైన్ విధానం.
ఈఓ పదవి తృప్తినిచ్చింది
సాక్షి, యాదాద్రి : ‘యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓగా పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. శ్రీస్వామివారి అనుగ్రహంతో అనేక సంస్కరణలు తీసుకువచ్చా. భక్తులకు వసతులు మెరుగుపర్చాను.. 14నెలల పదవీకాలం చాలా సంతృప్తినిచ్చిందని..’ ఈఓ భాస్కర్‌రావు తెలిపారు. బదిలీ అయిన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రెండుసార్లు స్వామివారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా పూర్తి చేశాను. ముఖ్యంగా తన హయాంలో ఆలయ విమానగోపురం స్వర్ణతాపడం పనులు పూర్తి చేయడం, గిరి ప్రదర్శనను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం మరి చిలోనివి. ఆటో కార్మికులకు అండగా నిలిచా. ప్రభుత్వ, ఆలయ అధికారులు, ఉ ద్యోగులు, అర్చకులు, సిబ్బంది సహకారం మరువలేనిది. వారందరికీ కృతజ్ఞతలు.
గుట్ట ఆలయ ఈఓగా వెంకట్రావ్
గుట్ట ఆలయ ఈఓగా వెంకట్రావ్


