గుట్టలో.. తిరుమల తరహాలో
30 నుంచి అందుబాటులోకి నూతన సేవలు
● సూర్యప్రభ వాహన సేవను ప్రతి ఆదివారం రథ సప్తమి రోజున ఉదయం 7 గంటల నుంచి 7.30 వరకు నిర్వహిస్తారు. భక్తులు రూ.1000 టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సేవలో పాల్గొనే భక్తులకు ఒక శెల్లా, ఒక కణుమ అందజేస్తారు.
● చంద్రప్రభ వాహన సేవను ప్రతి పౌర్ణమి రోజున సాయంత్రం వేళ నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే దంపతులు రూ.1000 టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీరికి ఒక శెల్లా, ఒక కణుమ ఇస్తారు.
సూర్యప్రభ వాహనం
ఫ వైధిక కమిటీ, దేవస్థానం ఆధ్వర్యంలో సన్నాహాలు
యాదగిరిగుట్ట : తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తిరుమల తిరుపతి తరహాలో నూతన సేవలు అందుబాటులోకి రానున్నాయి. 30వ తేదీన వైకుంఠ ఏకాదశి రోజునుంచి సహస్ర దీపాలంకరణ, తులాభారం, తోమాల సేవ.. ఫిబ్రవరి 1నుంచి సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలను ప్రారంభించేందుకు దేవస్థానం ఈఓ వెంకట్రావ్ ఆధ్వర్యంలో వైదిక కమిటీ, దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
నూతన సేవల వేళలు..
సహస్ర దీపాలంకార సేవను ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజు, ఏకాదశి రోజు సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే భక్తులకు రూ.500 టికెట్ నిర్ణయించారు. ఈ టిక్కెట్‌పై దంపతులకు ప్రవేశంతో పాటు రెండు 100 గ్రాముల (ఒక్కొకరికి ఒక్కటి చొప్పున) లడ్డూలు అందజేస్తారు.
తోమాల సేవ ప్రతి బుధవారం చేపడుతారు. రూ.500 టికెట్ కొనుగోలు చేసిన దంపతులకు అనుమతి ఉంటుంది. ఉదయం 6.15 నుంచి 6.45 గంటల వరకు తోమాల సేవ నిర్వహిస్తారు.
తిరుమల తిరుపతిలో భక్తులు తమ బరువును బ ట్టి ఇచ్చే తులాభారం సేవను ప్రతి రోజూ దర్శన సమయాల్లో నిర్వహించుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. తులాభారం సేవలో పాల్గొనే భక్తులకు తూకం కొలిచేందుకు నాణేలు, బెల్లం దేవస్థానమే అందుబాటులో ఉంచుతుంది. తూకానికి సమానమైన విలువను చెల్లించడంతో పాటు తమకు ఇష్టమైన వస్తువులను కూడా తీసుకువచ్చేందుకు వీలుకల్పించారు. తులభారం సేవలో పాల్గొనే భక్తులకు ఒక శెల్లా, ఒక కణుమ అందజేస్తారు.
గుట్టలో.. తిరుమల తరహాలో


