శారదాదేవి జీవితం ఆదర్శం
ఆలేరు: పట్టణంలోని శ్రీరామకృష్ణ విద్యాలయంలో సోమవారం శ్రీశారదాదేవి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈవేడుకలకు హైదరాబాద్ శ్రీరామకృష్ణ మఠం పూజ్య స్వామి తత్పదానందజీ మహరాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కుటుంబ విలువలకు, ఆదర్శ గృహిణికి శారదాదేవి జీవితమే ఆదర్శమన్నారు. ఈకార్యక్రమంలో విద్యాలయం కరస్పాండెంట్ బండి రాజుల శంకర్, రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ కో–ఆర్డినేటర్ సూర్యప్రకాష్,పాఠశాల ఆచార్యులు పాల్గొన్నారు.
మొర ఆలకించి.. అర్జీలు స్వీకరించి
భువనగిరిటౌన్ : సమస్యలు పరిష్కరించాలంటూ వివిధ గ్రామాల నుంచి ప్రజలు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. ప్రజావాణిలో అధికారులకు వినతులు అందజేసి పరిష్కారానికి వేడుకున్నారు. అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావుతో పాటు సంబంధిత శాఖల అధికారులు అర్జీలను స్వీకరించారు. 38 అర్జీలు రాగా అందులో రెవెన్యూకు సంబంధించివి 29 ఉన్నాయి. ప్రజావాణిలో అందిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను అదనపు కలెక్టర్లు ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ జయమ్మ, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లారీలు పంపకపోతే కేసులు నమోదు : కలెక్టర్
వలిగొండ : కొనుగోలు కేంద్రాలకు సమయానుకూలంగా, సరిపడా లారీలు పంపకపోతే కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సోమవారం ఆయన వలిగొండలోని వ్యవసాయ మార్కెట్, సంగెం, సుంకిశాలలో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఇప్పటి వరకు సేకరించింది, కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ట్యాబ్ ఎంట్రీ అయిందా, లేదా ఆరా తీశారు. లారీలు సమయానుకూలంగా రావడం లేదని కేంద్రాల నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. జాప్యం చేయకుండా సరిపడా లారీలు పంపాలని, అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. రైతుల ఖాతాల్లో 48 గంటల్లో డబ్బులు జమ అయ్యేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు.
నేడు భువనగిరికి కవిత..
భువనగిరి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం భువనగిరికి రానున్నారు. మొదటి రోజు ఉదయం బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శిస్తారు. ఉదయం 11.30 గంటలకు రాయగిరిలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్వాసితులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం బస్వాపురం రిజర్వాయర్, ఆలేరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శిస్తారు. అనంతరం ఆలేరు బ్రిడ్జిని పరిశీలించి, మోటకొండూరు మండలంలో ఇళ్ల పట్టాలు రాని బాధితులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 7గంటలకు ఆఫ్రికాలో ఉగ్రవాద చెరలో ఉన్న భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన నల్ల మాస ప్రవీణ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని పార్టీ నాయకులు తెలిపారు.
వెంకటస్వామికి నివాళి
భువనగిరిటౌన్ : మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత గడ్డం వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన చిత్రటపటానికి అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ జయమ్మ, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ విజయ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఓటరు మ్యాపింగ్‌పై సమీక్ష
భువనగిరిటౌన్ : ఓటర్ల మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధి కారి సుదర్శన్‌రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఈఆర్‌ఓలు, చారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈఆర్‌ఓలు పూర్తి బాధ్యతను తీసుకొని ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
శారదాదేవి జీవితం ఆదర్శం


