శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
వలిగొండ : విద్యార్థులు శాసీ్త్రయదృక్పథం అలవర్చుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం వలిగొండలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శనను కలెక్టర్ హనుమంతరావు, డీఈఓ సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయన్నారు. శాసీ్త్రయ, సాంకేతిక రంగాల్లో విద్యార్థుల ప్రతిభ ప్రతిబింబించే విధంగా వైజ్ఞానిక ప్రదర్శనలు ఉండాలన్నారు.
పరిశోధనాత్మక దృక్పథంతో
ఆవిష్కరణలు ఉండాలి : కలెక్టర్
రైతులతో పాటు వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగేలా పరిశోధన దృక్పథంతో ఆవిష్కరణలు ఉండాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాల్గొనాలనే ఆసక్తి కలిగిన విద్యార్థులకు సహకారం అందిస్తామన్నారు. పదో తరగతి విద్యార్థులు గత ఏడాది మాదిరిగానే, ఈ విద్యా సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులను ఆవిష్కరించిన ఎగ్జిబిట్‌లను పరిశీలించి అభినందించారు. అదే విధంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల సంస్కాృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వరంగల్ ఎన్‌ఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.హరిప్రసాద్, విద్యాశాఖ ఏడీ ప్రశాంత్‌రెడ్డి, జిల్లా కో–ఆర్డినేటర్లు, జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్, ఎంఈఓలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి


