హెచ్‌పీవీతో క్యాన్సర్‌కు చెక్
భువనగిరి : మహిళలను ఎక్కువగా వేధిస్తున్న గర్భాశయ క్యాన్సర్‌కు ఆదిలోనే చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 9 నుంచి 14 ఏళ్ల వయసున్న హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమ వైరస్) టీకా ఇచ్చేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.చాలామంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో మృతి చెందుతున్నారు. ప్రాణాంతకమైన క్యాన్సర్‌ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. చిన్నతనంలోనే హెచ్‌పీవీ టీకా వేయడం వల్ల ప్రాణాంతక వ్యాధిని ప్రారంభంలోనే అదుపు చేయవచ్చని వైద్యాధికారులు అంటున్నారు.
నేడు తొలి విడత శిక్షణ
హెచ్‌పీవీ టీకా కార్యక్రమం కోసం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో వైద్యులు, ఫార్మసిస్టులు, మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు ఉంటారు. మంగళవారం (నేడు) డాక్టర్లు, ఫార్మసిస్టులకు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఉంటుంది. అదే విధంగా హెచ్‌పీవీ టీకాపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శిక్షణ, అవగాహన కార్యక్రమాలు ముగిసిన అనంతరం కిశోర బాలికలను గుర్తించడానికి సర్వే చేపట్టనున్నారు. ప్రస్తుతం జిల్లాలో గర్భాశయ క్యాన్సర్ బాధితులు 151 మంది ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
ఫ 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకా
ఫ ప్రణాళిక సిద్ధం చేసిన వైద్యారోగ్య శాఖ
ఫ నేడు వైద్యులు, ఫార్మసిస్టులకు శిక్షణ
ఫ తల్లిదండ్రులకు అవగాహన
స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన హెచ్‌పీవీ టీకా ధర రూ.200లుగా నిర్ణయించారు. ఇప్పటికే సర్వైకల్ వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించింది. దీంతో వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలుత 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు ఒకేసారి క్యాచ్ ఆఫ్ టీకా ఇవ్వనున్నారు. టీకా ఇచ్చిన రోజు పాఠశాలకు రాని బాలికలకు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ స్కూళ్లలోని బాలికలకు టీకా ఇవ్వనున్నారు. అర్హులైన బాలికలను గుర్తించేందుకు త్వరలో సర్వే చేయనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందు కోసం పాఠశాలలనే వేదికగా చేసుకోనున్నారు. గుర్తించిన బాలికలకు ఏఎన్‌ఎంలు టీకా ఇవ్వనున్నారు.
హెచ్‌పీవీతో క్యాన్సర్‌కు చెక్


