మొదటి రోజే హామీల అమలుకు శ్రీకారం..
రామన్నపేట : బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజునే ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు శ్రీకారం చుట్టింది.. రామన్నపేట మండలంలోని సిరిపురం సర్పంచ్ అంబటి ఉపేంద్రమ్మ. గ్రామంలోని వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా రెండు రోజు లకు ఒకసారి వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఉచితంగా ఫ్యూరిఫైడ్ నీళ్లు అందజేస్తానని ఉపేంద్రమ్మ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. హామీ మేరకు సోమవారం సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంచినీటిని పట్టుకునేందుకు క్యాన్లు పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ ప్లాంట్ ద్వారా ఉచితంగా నీరందించేలా త్వరలో కార్యాచరణ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మూడుదుడ్ల అనూష, బీజేపీ రాష్ట్ర నాయకులు కాసం వెంకటేశ్వర్లు, ఏళ్ల సంజీవరెడ్డి, పున్న వెంకటేశం, కూనూరు ముత్తయ్య, బండ శ్రీనివాస్‌రెడ్డి, కట్ట అంజిరెడ్డి, సతీష్‌రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


