
రైతన్నను ముంచిన వడగండ్ల వాన
మోటకొండూరు, అడ్డగూడూరు, ఆత్మకూర్(ఎం), ఆలేరు రూరల్ : జిల్లాలో ఆదివారం సాయంత్రం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన, ఈదురుగాలులకు భారీ నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. కోత దశలో ఉన్న వరి చేలు నేలకొరిగాయి. మామిడి కాయలు నేలరాలాయి. వ్యవసాయ అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేశారు. నష్టం నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : బీర్ల ఐలయ్య
ఈదురుగాలులు, వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను సోమవారం ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పరిశీలించారు. రైతలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడి నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లిస్తామని, ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. పంట నష్టం నివేదిక పక్కాగా ఉండాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట నాయకులు యాస లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ తండ మంగమ్మ, యెల్లంల సంజీవరెడ్డి, గంగపురం మల్లేష్, కొంతం మోహన్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.
వందల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని
అంచనా వేసిన అధికారులు

రైతన్నను ముంచిన వడగండ్ల వాన

రైతన్నను ముంచిన వడగండ్ల వాన