
దొడ్డా పద్మ ఆశయాలు సాధించాలి
చిలుకూరు: హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య సతీమణి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు దొడ్డా పద్మ ఆశయాలను సాధించాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం చిలుకూరులో దొడ్డా పద్మ సంతాప సభలో ఆయన పొల్గొని మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమయంలో తన భర్త దొడ్డా నర్సయ్యతో కలిసి నల్లమల్ల అడవుల్లో మూడేళ్లు పాటు అజ్ఞాతవాసం చేసిన మహోన్నత మహిళ దొడ్డా పద్మ అన్నారు. ఆమె మరణం సీపీఐకి తీరనిలోటని అన్నారు. అంతకుముందు చిలుకూరు సీపీఐ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య విగ్రహానికి నివాళులర్పించారు. అదేవిధంగా స్వాంతంత్య్ర సమరయోధుడు దొడ్డా నారాయణరావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ప్రముఖ వైద్యుడు జాస్తి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సంతాప సభలో అందె సత్యం, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు వక్కంతుల కోటేశ్వరరావు, సీపీఐ ఏపీ రాష్ట్ర నాయకులు చలసాని రాఘవేంద్రరావు, చలసాని రామారావు, కాట్రగడ్డ స్వరూపరాణి, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి, సహాయ కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, సాహెబ్ అలీ, జిల్లా, మండల నాయకులు మేకల శ్రీనివాసరావు, పోకల వెంకటేశ్వర్లు, గుండు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, దేవరం మల్లేశ్వరీ, చేపూరి కొండలు, చిలువేరు అంజనేయులు, సుల్తాన్ వెంకటేశ్వర్లు, నంధ్యాల రామిరెడ్డి, సిరాపురపు శ్రీనివాస్‌రావు, బాలేబోయిన రాంబాబు, అనంతుల రాము, కస్తూరి సైదులు, కొండలు, లక్ష్మయ్య , వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

దొడ్డా పద్మ ఆశయాలు సాధించాలి