
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
తిప్పర్తి: తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఆది వారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తలించారు. ఎస్‌ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి గ్రామానికి చెందిన మేడిశెట్టి పరుశురాములు, నల్ల గొండ పట్టణంలోని బీటీఎస్ ప్రాంతానికి చెందిన ఎండీ షఫీ గంజాయి విక్రయిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో ఆదివారం తిప్పర్తి ఎస్‌ఐ శంకర్ తన సిబ్బందితో కలిసి అనిశెట్టి దుప్పలపల్లి గ్రామ శివారులో సోదాలు నిర్వహించగా మేడిశెట్టి పరుశురాములు పట్టుబడ్డాడు. షఫీ పరారయ్యాడు. పరుశురాములు వద్ద రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితులు హైదరాబాద్‌లోని ధూల్‌పేట నుంచి గంజాయి కొనుగోలు చేసి తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో మార్చి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని సీజ్ చేసి పరుశురాములును రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. షఫీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
మరొకరు పరారీ
రెండు కేజీల గంజాయి స్వాధీనం