
ఉపేంద్రచారికి స్వర కిరీటి జాతీయ ప్రతిభా పురస్కారం
సూర్యాపేట: సూర్యాపేట మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న గుండెపురి ఉపేంద్రచారికి స్వర కిరీటి జాతీయ ప్రతిభా పురస్కారం లభించింది. ఏపీలోని ఏలూరులో ఆదివారం శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సింగర్స్ ఫెస్ట్–2025లో శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్‌కుమార్ చేతులమీదుగా ఉపేంద్రచారి జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. గానం, కళా రంగంలో తన ప్రత్యేకతను చాటుకున్న ఉపేంద్రచారికి స్వర కిరీటి జాతీయ ప్రతిభా పురస్కారం అందజేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక నిర్వాహకులు ఈశ్వరి భూషణం, లలిత, టి. పార్ధసారథి, శ్రీహరి కోటి తదితరులు పాల్గొన్నారు. ఉపేంద్రచారికి సూర్యాపేట మున్సిపల్ అధికారులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు, బంధువులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.