గుర్తుతెలియని యాచకురాలు మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని యాచకురాలు మృతి

Aug 11 2025 7:35 AM | Updated on Aug 11 2025 7:35 AM

గుర్త

గుర్తుతెలియని యాచకురాలు మృతి

కొండమల్లేపల్లి: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన గుర్తుతెలియని వృద్ధ యాచుకురాలు చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. కొండమల్లేపల్లి ఎస్‌ఐ అజ్మీరా రమేష్‌ తెలిపిన ప్రకారం.. కొండమల్లేపల్లి చౌరస్తా వద్ద అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న వృద్ధ యాచకురాలిని ఆదివారం స్థానికులు గుర్తించి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది సదరు యాచకురాలిని దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది. మృతురాలి వయస్సు 60 నుంచి 65 ఏళ్లు ఉంటుందని, ఆకుపచ్చ పువ్వులు గల చీర ధరించి ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 8712670226, 8712670158 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ సూచించారు.

విద్యుదాఘాతంతో..

భువనగిరి: భువనగిరి మండలంలోని బొమ్మాయిపల్లి–నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి(సుమారు 60 ఏళ్లు) రైలు పట్టాల పక్కన నచుకుంటూ వెళ్తూ రైల్వే కేబుల్‌ బాక్సుల వద్ద విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు గులాబీ రంగు చొక్కా, తెలుపు రంగు లుంగీ ధరించి ఉన్నట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి మార్చరీకి తరలించినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన 98482 22169 నంబర్‌ను సంప్రదించాలని భువనగిరి రైల్వే పోలీస్‌ ఇన్‌చార్జి కృష్ణారావు సూచించారు.

గుండెపోటుతో

ప్రధానోపాధ్యాయుడు..

చింతపల్లి: చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయుడు యాదగిరి(59) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మన్నెగూడలో తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం యాదగిరి నిద్రిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. యాదగిరి మృతి వార్త తెలుసుకున్న వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎంఈఓ అంజయ్య, పాఠశాల ఉపాధ్యాయులు కోట్ల యాదగిరి, ముసుగు ఆనంద్‌బాబు, ఒడుగు ప్రకాష్‌ ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. యాదగిరి గత 10సంవత్సరాలుగా చింతపల్లి మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

వైద్య కళాశాలకు వృద్ధుడి పార్థివదేహం అప్పగింత

సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని చర్చి కాంపౌండ్‌లో నివాసముంటున్న స్వాతంత్య్ర సమరయోధుడు టంగుటూరు కోటయ్య వయోభారంతో ఆదివారం మృతిచెందారు. కోటయ్య భౌతికకాయానికి స్పందన అవయవ దాన సేవా సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు గుండా రమేష్‌, మిట్టకోల కోటయ్య, కోశాధికారి హనుమాన్ల పిచ్చిరెడ్డి, సభ్యుడు శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోటయ్య పార్థివదేహాన్ని కుటుంబ సభ్యుల అనుమతితో వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తం మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలోని దిండిగల్‌లో గల అరుంధతి వైద్య కళాశాలకు అప్పగించారు.

గుర్తుతెలియని  యాచకురాలు మృతి1
1/1

గుర్తుతెలియని యాచకురాలు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement