చౌటుప్పల్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఖరారు
చౌటుప్పల్ : చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ఖరారయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు శుక్రారం ఉత్తర్వులు జారీ చేశారు. గత మార్చి నెలలోనే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పంపించిన విధంగా కమిటీ ఏర్పాటు ప్రతిపాదనలను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆమోదించారు. చౌటుప్పల్ మండలంలోని 26 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలోని 5గ్రామాలతోపాటు పోచంపల్లి మండలంలోని 10, నల్లగొండ జిల్లా చిట్యాల మండంలోని 10 పంచాయతీలు ఈ మార్కెట్ పరిధిలోకి రానున్నాయి. అందులో బాగంగా పాలకవర్గ ఏర్పాటులోనూ ఆయా మండలాల నుంచి పలువురికి ప్రాతినిథ్యం లభించింది.
నూతన కమిటీలో
చోటు దక్కింది వీరికే..
మార్కెట్ కమిటీ పాలకవర్గం 18మంది సభ్యులతో ఖరారయ్యింది. చైర్మన్‌గాచౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగడపల్లికి చెందిన ఉబ్బు వెంకటయ్య నియమితులయ్యా రు. వైస్ చైర్మన్‌గా లక్కారం గ్రామానికి చెందిన ఆకుల ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్లుగా బోయ వెంకటేశం, కరంటోతు శంకర్, ఢిల్లీ చంద్రకళ, చప్పిడి సంజీవరెడ్డి, కాటేపల్లి నవీన్, ఎండి.గౌస్‌ఖాన్, చిమ్ముల వెంకట్‌రెడ్డి, పబ్బు శ్రీకాంత్, మర్రి రాజిరెడ్డి, సుర్వి వెంకటేష్, ట్రేడర్ల నుంచి దాచేపల్లి విజయ్, గజ్జెల కృష్ణమూర్తితోపాటు వెలిమినేడు పీఏసీఎస్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, చౌటుప్పల్ మున్సిపల్ ప్రత్యేకాధికారి, చౌటుప్పల్ వ్యవసాయాధికారి సభ్యులుగా వ్యవహరించనున్నారు. చౌటుప్పల్ సింగిల్‌విండో చైర్మన్‌కు కమిటీలో చోటు దక్కలేదు. నూతన పాలకవర్గం ఈనెల 13న ప్రమాణస్వీకారం చేయనుంది.
చైర్మన్‌గా ఉబ్బు వెంకటయ్య,
వైస్ చైర్మన్‌గా ఆకుల ఇంద్రసేనారెడ్డి
వెలువడిన అధికారిక ప్రకటన
13న ప్రమాణ స్వీకారం


