బీబీనగర్: క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించకుండా పాస్‌పుస్తకాలు జారీ చేసిన తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. బీబీనగర్ మండలం పడమటిసోమారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 242, 254ల మధ్యలో గల కొన్ని సర్వే నంబర్లకు చెందిన భూములను కొన్నేళ్ల క్రితం ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేసింది. వెంచర్లు చేసి ప్లాట్లు విక్రయించింది. అయితే కొనుగోలు చేసిన భూములను రియల్ ఎస్టేట్ సంస్థ మ్యూటేషన్ చేసుకోలేదు. ఆ స్థలంపై కన్నేసిన కొందరు నాయకులు రియల్ ఎస్టేట్‌కు సంస్థకు భూములు విక్రయించిన వారిని ప్రలోభపెట్టారు. కొంత డబ్బు ముట్టజెప్పి మరలా ఆ భూములను వారి పేరున మార్చేందుకు దరఖాస్తు చేయించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు రావడంతో.. వెంచర్లలోని కొంతభాగంలో ఉన్న ప్లాట్లను చెడగొట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాన్యం ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించారు. తహసీల్దార్ క్షేత్రస్థాయికి వెళ్లి భూములను పరిశీలించకుండానే దరఖాస్తుదారులకు పాస్‌పుస్తకాలు జారీచేసినట్లు విచారణలో తేలింది. అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం తహసీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.
ఫ భూములను పరిశీలించకుండానే పాస్‌పుస్తకాలు జారీ
ఫ కలెక్టర్‌కు రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాన్యం ఫిర్యాదు
ఫ విచారణలో వాస్తవమని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు


