రెండు విడతల్లో ‘టెట్’
నేటి నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు
భువనగిరి : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను శనివారం నుంచి ఈనెల 31 వరకు రోజూ రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖ్‌లోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల సెంటర్‌లో మాత్రం 4వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈ కేంద్రంలో 100 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. మిగతా అభ్యర్థులు పొరుగు జిల్లాల్లో పరీక్షలు రాయనున్నారు.
టెట్ రాయనున్న ఉపాధ్యాయులు
2011కు ముందు నుంచి సర్వీస్‌లో కొనసాగుతున్న ఉపాధ్యాయులకు సైతం టెట్ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఉద్యోగంలో కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా టెట్ ఉత్తీర్ణులు కా వాలని ఆదేశించింది. రెండేళ్లలో ఉత్తీర్ణత సాధించాలని సెప్టెంబర్ తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో 1,207 మంది ఉపాధ్యాయులు టెట్ రాయనున్నారు.
మొత్తం అభ్యర్థులు..
టెట్‌కు జిల్లా నుంచి 6,852 మంది హాజరుకానున్నారు. పేపర్–1కు 1,179 మంది హాజరుకానుండగా.. వీరిలో 495 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పేపర్–2 పరీక్ష 5,673 మంది రాయనుండగా.. ఇందులో 712 మంది ఉపాధ్యాయులు హాజరయ్యే అవకాశం ఉంది. వీరంతా భువనగిరి జిల్లాలోని దేశిముఖితో పాటు హైదరాబాద్, నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, జనగామలో ఏర్పాటు చేసే కేంద్రాల్లో పరీక్షలకు హాజరుకానున్నారు.
ఫ హాజరుకానున్న 6,852 మంది అభ్యర్థులు
ఫ జిల్లా పరిధిలో దేశ్‌ముఖి ఇంజనీరింగ్ కళాశాలలో సెంటర్ ఏర్పాటు


