మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం
భువనగిరి, భువనగిరిటౌన్ : గోదావరి జలాల సప్లయ్ ఫేజ్–1 బొమ్మకల్ పరిధిలో పైపులైన్‌కు మరమ్మతుల కారణంగా రెండు రోజులు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మిషన్ భగీరథ భువనగిరి డివిజన్ కార్యనిర్వాహక ఇంజనీర్ కరుణాకరణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం వరకు భువనగిరి నియోజకవర్గంలోని భువనగిరి, వలిగొండ, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి మండలాల పరిధిలోని16 గ్రామాలు, రామన్నపేట మండల పరిధిలో 8 గ్రామాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. అలాగే ఆలేరు నియోజకవర్గంలోని రాజాపేట, ఆత్మకూరు(ఎం), యాదరగిరిగుట్ట, ఆలేరు, గుండాల, యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి నీటి సరఫరా ఉండదన్నారు. ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.
స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు
భువనగిరిటౌన్ : 2025–26 విద్యాసంవత్సరానికి గానూ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తే ఎస్‌సీ విద్యార్థులు పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు గడువు మార్చి 31వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సాహితి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రెషర్స్‌తో పాటు రెన్యూవల్ కోసం telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
చిన్నమేడారంలో ముగిసిన వేళం పాటలు
రాజాపేట : మండలంలోని చిన్నమేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా వివిధ రకాల వస్తువుల విక్రయాల కోసం శుక్రవారం వేలం పాటలు నిర్వహించారు. కొబ్బరికాయలు రూ.2.60 లక్షలు.. లడ్డూ, పులిహోర రూ.91వేలు, తలనీలాలు రూ.52వేలు, పుట్టువెంట్రుకలు రూ.28 వేలు, కొబ్బరి చిన్పలు రూ.1.23 లక్షలు, బెల్లం రూ.1.58లక్షలు, వడిబియ్యం రూ.18 వేలకు పలువురు దక్కించుకున్నారు. వీటితో పాటు కోళ్లు, మాసం వ్యాపారాలకు సంబంధించి రూ.10లక్షల 3వేలకు దక్కించుకున్నారని నిర్వాహకులు తెలిపారు.
ఆయిల్‌పామ్ సాగువిస్తీర్ణం పెంచండి
భువనగిరిటౌన్ : జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచాలని అధికారులను కలెక్టర్ హ నుమంతరావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉద్యానవన, వ్యవసాయ, కోపరేటివ్, ఆయిల్‌పెడ్ ఆధ్వర్యంలో ఏఓలు, పీఏసీఎస్ కార్యదర్శులు, హార్టికల్చర్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఆయిల్‌పామ్ సాగుపై సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరం 3,500 ఎకరాల్లో సాగు లక్ష్యంగా ఉందని, రైతులను ప్రోత్సహించి లక్ష్యం చేరుకో వాలన్నారు. సమావేశంలో ఉద్యానవన శాఖ అధికారి మాధవి, వ్యవసాయాధికారి రమణా రెడ్డి, కోఆపరేటివ్ అధికారి మురళి పాల్గొన్నారు.
నిజమైన రైతులకేయూరియా ఇవ్వాలి
యాదగిరిగుట్ట రూరల్: నిజమైన రైతులకు మా త్రమే యూరియా సరఫరా చేయాలని ఏడీ ఏ శాంతినిర్మల సూచించారు. వంగపల్లి పీఏసీఎస్ ను శుక్రవారం ఆమె సందర్శించారు. యూరియా విక్రయాలపై ఆరా తీసి, స్టాక్‌ను పరిశీలించారు. యాప్ ద్వారా యూరియా బుకింగ్‌పై రైతుల్లో అపోహలు తొలగించాలని, ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం


