మన ఓట్లు ఉన్నాయా..
భువనగిరిటౌన్ : మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రూపొందించి మున్సిపల్, ఆర్డీఓ కార్యాలయాల్లో నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించిన ఓటరు ముసాయిదా జాబితాలపై అధికారులు అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. వార్డు మార్పులు, పేర్లు, చిరునామా వంటి అంశాలను నాయకులు, ఓటర్లు కార్యాలయాలకు వచ్చి చూసుకుంటున్నారు. సరిగా లేనిపక్షంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దరఖాస్తులు అందజేస్తున్నారు.అభ్యంతరాలు తెలియజేసేందుకు ఈనెల 4వ తేదీ వరకు గడువు ఉంది. కాగా భువనగిరి మున్సిపాలిటీలో శుక్రవారం ఏడు అభ్యంతరాలు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ రామలింగం తెలిపారు.
చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీలో రెండు అభ్యంతరాలు వచ్చాయి. కుటుంబానికి చెందిన మొత్తం ఓట్లు ఒకే వార్డులో కాకుండా వేర్వేరు వార్డుల్లోకి వెళ్లడంతో సదరు కుటుంబ సభ్యులు దరఖాస్తు అందజేశారు. అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు.
భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి మున్సిపాలిటీలో ఆరు అభ్యంతరాలు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డి తెలిపారు. 13 వార్డులు ఉన్నాయని, వార్డుకు రెండు చొప్పున 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
నివాసం ఉన్న వార్డుకు మార్చండి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 15 దరఖాస్తులు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ లింగస్వామి తెలిపారు. అయితే పలు వార్డులకు చెందిన ఓటర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దరఖాస్తులు అందజేశారు. తాము నివాసం ఉంటున్న వార్డులో కాకుండా మరో వార్డులో ఓట్లు ఉన్నాయని, వాటిని ప్రస్తుతం నివాసం ఉంటున్న వార్డులోకి మార్చాలని కోరారు.
ఫ ముసాయిదా జాబితాలో పేర్లు,
చిరునామా చూసుకుంటున్న ఓటర్లు
ఫ సరిగా లేనట్లయితే అభ్యంతరాలు
ఫ మొదటి రోజు 50 పైగా దరఖాస్తులు
మన ఓట్లు ఉన్నాయా..


