కోతుల భయంతో పైనుంచి దూకిన విద్యార్థిని | Sakshi
Sakshi News home page

కోతుల భయంతో పైనుంచి దూకిన విద్యార్థిని

Published Tue, Feb 27 2024 2:10 AM

-

బొమ్మలరామారం: కోతుల భయంతో ఓ విద్యార్థిని పాఠశాల భవనం పైనుంచి దూకింది. ఈ ఘటన బొమ్మలరామారం మండల కేంద్రంలో సోమవారం జరిగింది. వివరాలు.. బొమ్మలరామారం మండల కేంద్రానికి చెందిన భార్గవి స్థానికంగా ఉన్న మాతృశ్రీ హైస్కూల్‌లో 10వ తరగతి చదవుతోంది. రోజు మాదిగా సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన భార్గవి పాఠశాల మొదటి అంతస్తులో చదువుకుంటోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా కోతుల గుంపు విద్యార్థులు పైకి వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన భార్గవి పాఠశాల మొదటి అంతస్తు నుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలపాలైన భార్గవిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను పాఠశాల యాజమాన్యం, విద్యార్థిని తల్లిదండ్రులు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలిసింది. ఇదే విషయమై ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డిని సంప్రదించగా.. విద్యార్థిని పాఠశాల భవనం పైనుంచి దూకిన ఘటన తమ దృష్టికి రాలేదన్నారు.

తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement