విధులకు గైర్హాజరైన ఎంపీడీఓకు షోకాజ్ నోటీసు
ఆత్మకూరు(ఎం) : విధులకు గైర్హాజరైన ఆత్మకూరు(ఎం) ఎంపీడీఓ రాములునాయక్‌కు కలెక్టర్ హనుమంతరావు షోకాజ్ నోటీసు జారీ చేశారు. బుధవారం కలెక్టర్ హనుమంతరావు మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేయగా ఎంపీడీఓ రాములునాయక్ విధులకు గైర్హాజరైన విషయం వెలుగుచూసింది. దీంతో ఎంపీడీఓకు నోటీసులు జారీచేశారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు. ఎస్‌ఐఆర్(సర్) ప్రక్రియకు సంబంధించి కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయాలన్నారు. అక్కడే ఉన్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఎందుకు వచ్చారని అడగడంతో తాము కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చినట్లు చెప్పారు. వారంలో ఒక రోజు స్కూల్ వద్ద క్యాంప్ ఏర్పాటు చేసి ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.


