రిజర్వేషన్లపై ఉత్కంఠ
గత ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇలా..
ముసాయిదాపై సమావేశం
సాక్షి, యాదాద్రి : మున్సిపల్ ఎన్నికలు జరిగితే రిజర్వేషన్లు ఎలా ఉంటాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల లెక్క తేల్చారు. ఓటర్ల ఆధారంగా పోలింగ్ కేంద్రాలను మ్యాపింగ్ చేస్తారు. గురువారం సాయంత్రం ఓటరు ముసాయిదా జాబితా ప్రకటించనున్నారు. ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరిస్తారు. ఓటరు ముసాయిదా జాబితా తయారీపై మున్సిపల్ కమిషనర్లతో బుధవారం అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అక్టోబర్ ఓటరు జాబితా ఆధారంగా..
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు 2025 అక్టోబర్ 31న ప్రకటించిన ఓటరు జాబితాను ఆధారంగా చేసుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ఓటరు జాబితా ప్రకారం మున్సిపాలిటీలో ఉన్న వార్డులకు సమానంగా ఓటర్లను కేటాయిస్తారు. కొద్ది ఓట్ల తేడాతో వార్డులను సర్దుబాటు చేస్తున్నారు. భారీ తేడాతో ఓట్లు లేకుండా అధికారులు హద్దులు నిర్ణయిస్తున్నారు. అయితే ఒకే కుటుంబంలో ఉండే ఓటర్లు ఒకే వార్డు, ఒకే పోలింగ్ స్టేషన్‌లో ఉండాలన్న నిబంధనల అమలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒకే ఇంట్లో ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఉన్నాయి.
600 ఓట్లకు ఒక పోలింగ్ స్టేషన్
మున్సిపల్ ఎన్నికల్లో 600 ఓట్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఒక పోలింగ్ స్టేషన్‌లో 800కు మించి ఓటర్లు ఉండకూడదు. అవసరమైతే మూడో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. మూడో పోలింగ్ కేంద్రం ఏర్పాటు.. పోలింగ్ కేంద్రాల్లో ఉండే ఓటర్ల ఆధారంగా నిర్ణయిస్తారు.
రిజర్వేషన్లపై స్పష్టత లేదు
మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ స్థానాలల రిజర్వేషన్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఈసారి రిజర్వేషన్లు సీపెక్ సర్వే ప్రకారం చేస్తారా.. లేక వార్డు సభల ద్వారా చేస్తారా అన్నది ఎన్నికల కమిషన్ నిర్ణయించాలి. అయితే, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లలో మహిళా, జనరల్ రిజర్వేషన్లు రొటేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
జోరుగా కొత్త దరఖాస్తులు
ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో ఓటు హక్కు కోసం ఇప్పటి వరకు కొత్తగా 600కు పైగా దరఖాస్తులు అందాయి. ప్రధానంగా గ్రామ పంచాయతీల్లో ఉన్న ఓటర్లు మున్సిపాలిటీలలో ఓటు కోసం ప్రయత్నిస్తున్నారు. పలువురు చిరునామా మారినప్పటికీ పాత అడ్రస్‌లోనే ఓటు హక్కు ఉంది. దీంతో ప్రస్తుత చిరునామాకు మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 2019లో జరిగిన ఎన్నికల్లో భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ స్థానాలు బీసీ జనరల్‌కు రిజర్వు అయ్యా యి. యాదగిరిగుట్ట, పోచంపల్లి మున్సిపాలిటీలు బీసీ మహిళకు, మోత్కూరు జనరల్ మహిళ కేటగిరీలో రిజర్వు అయ్యాయి. గత ఎన్నికల్లో మున్సిపల్ రిజర్వేషన్లు రాష్ట్ర యూనిట్‌గా జరిగాయి.
మున్సిపాలిటీల్లో నేడు ఓటరు, పోలింగ్ కేంద్రాల ముసాయిదా
ఫ మూడు రోజులు పాటు అభ్యంతరాల స్వీకరణ
ఫ 5, 6 తేదీల్లో రాజకీయ
పార్టీలతో సమావేశం
ఫ 10న తుది జాబితాల ప్రకటన
ఫ ప్రతి వార్డుకు రెండు పోలింగ్ కేంద్రాలు
భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, మోత్కూరు మున్సిపాలిటీల్లో నేడు పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటరు జాబితాలను ప్రకటిస్తారు. మున్సిపల్ కార్యాలయం, వార్డు కార్యాలయాల్లో నోటీస్ బోర్డులపై ముసాయిదా జాబితాలను ఉంచుతారు. ముసాయిదాలో ఉన్న ఓటరు పేరు, చిరునామాల్లో మార్పులు ఉంటే అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఓటర్లు ముసాయిదా జాబితాలను పరిశీలించి తమ అభ్యంతరాలను వెంటనే తెలిపితే వాటిని పరిష్కరిస్తారు. ఓటరు ముసాయిదాపై ఈ నెల 5న మున్సిపాలిటీలలో, 6న జిల్లా స్థాయిలో అధికారులు రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తారు. 10న ప్రకటించే తుది పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితా ఆధారంగా ఎన్నికలు జరుగుతాయి.


