ప్రజలకు కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
భువనగిరి : జిల్లా ప్రజలకు కలెక్టర్ హనుమంతరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ శుభాలు కలగాలని, ప్రతి కుటుంబంలో ఆనందం నింపాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలతో ముందుకుసాగాలని, పట్టుదల కృషితో విజయం సాధించాలని పేర్కొన్నారు.
దివ్యాంగుల వివాహపథకానికి దరఖాస్తులు
భువనగిరి : దివ్యాంగులు వివాహ ప్రోత్సాహక పథకాన్ని వినియోగించుకోవాలని సీ్త్ర శిశు వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి నర్సింహారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులు సాధారణ వ్యక్తులను లేదా మరో వికలాంగుడిని వివాహం చేసుకుంటే అర్హులైన వారికి ప్రభుత్వం రూ.లక్ష ప్రోత్సాహకంగా అందజేయబడుతుందని, అర్హులైన వారు వివాహమైన ఏడాది లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
మాక్ పోలింగ్
ఆలేరు : ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, తిరస్కరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రకటించడం, పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, విజేతకు ధ్రువపత్రాల అందజేత వరకు విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దాసరి మంజుల, ఉపాధ్యాయులు రావుల సత్యనారాయణరెడ్డి, పోరెడ్డి రంగయ్య, సుజారాణి, దూడల వెంకటేష్, సైదులు, మల్లేశం, హేమలత, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రచారం చేయాలి
ఫ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్
చౌటుప్పల్ : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో బుధవారం నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓట్ల కోసం ఆచరణకు సాధ్యంకాని హామీలతో గద్దెనెక్కి హామీలను అమలు చేయమంటే తప్పించుకు తిరుగుతున్న కాంగ్రెస్ తీరును ఎండగట్టాలన్నారు. పక్కా ప్రణాళికలతో మున్సిపల ఎన్నికలను ఎదుర్కోవాలని, అత్యధిక వార్డులను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, మున్సిపల్ కమిటీ అధ్యక్షురాలు కడారి కల్పన, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, సర్పంచ్‌లు తంగెళ్ల వెంకటేశం, నందగిరి వెంకటేష్, బోయ మహేంద్రమణి, నాయకులు పోలోజు శ్రీధర్‌బాబు, గుజ్జుల సురేందర్‌రెడ్డి, ఆలె చిరంజీవి, కంచర్ల గోవర్దన్‌రెడ్డి, మునగాల తిరుపతిరెడ్డి, ఉబ్బు భిక్షపతి, ఊడుగు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు


