
గవర్నర్‌కు మట్టి కలశం అందజేస్తున్న అధికారులు, యువజన సంఘాల నాయకులు
సాక్షి,యాదాద్రి : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సోమవారం జరగాల్సిన కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర వాయిదా పడినట్లు టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనగామ, ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరప తలపెట్టిన బస్సు యాత్రకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశామని, పాదయాత్రలు, కార్నర్ మీటింగ్‌లకు ఏర్పాట్లు చేశామన్నారు. అయితే అనివార్యకారణాల వల్ల బస్సు యాత్రను టీపీసీసీ అధిష్టానం వాయిదా వేసిందన్నారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
గవర్నర్‌కు మట్టి అందజేత
భువనగిరి : దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లు, అమరవీరుల స్మారకార్థం ఢిలీల్లో నిర్మించనున్న అమృతవాటిక కోసం జిల్లా అధికారుల ఆధ్వర్యంలో సేకరించిన మట్టిని ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైకి అందజేశారు. మట్టిని అందజేసిన వారిలో అధికారులతో పాటు నవభారత్ యూత్ సరగడ కరుణ్, నెహ్రూ యువ కేంద్రం వలంటీర్లు అంబేద్కర్, సంపత్ తదితరులు ఉన్నారు.
బీఆర్‌ఎస్‌వి ఆచరణకు సాధ్యంకాని హామీలు
చౌటుప్పల్ : గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో విఫలమైన బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ఈసారి కూడా మేనిఫెస్టోలో ఆచరణకు సాధ్యంకాని హామీలు ఇచ్చిందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ విమర్శించారు. ఆదివారం చౌటుప్పల్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ అధికారం దాహంతో అవకాశవాద రాజకీయం చేస్తుందన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం చౌటుప్పల్ పట్టణ కార్యదర్శి బండారు నర్సింహ, నాయకులు గోశికస్వామి, ఎండీ పాష, అవ్వారు రామేశ్వరి, గడ్డం వెంకటేష్, గోపగోని లక్ష్మణ్, దండ అరుణ్‌కుమార్, ఆకుల ధర్మయ్య, గోశిక కరుణాకర్, బొడ్డు అంజిరెడ్డి, ఉష్కాగుల రమేష్, ఎర్ర ఊషయ్య, చీకూరి దాసు, ఎండీ ఖయ్యూం పాల్గొన్నారు.
హైవేపై వాహనాల రద్దీ
చౌటుప్పల్ : హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. సెలవురోజు, శుభకార్యాలు కూడా ఉండడంతో వాహనాల రాకపోకలు పెరిగాయి. దీనికి తోడు చౌటుప్పల్ పట్టణంలో వారాంతపు సంత ఉండడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. జంక్షన్ల వద్ద రోడ్డు దాటేందుకు అవస్థలుపడ్డారు.
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
భువనగిరి రూరల్ : మండలంలోని నందనం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సందర్శించారు. ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యం తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని సూచించారు. ఆయన వెంట సీసీ నర్సింగరావు, వీఓఏ సరిత ఉన్నారు.

చౌటుప్పల్‌లో బారులుదీరిన వాహనాలు

మాట్లాడుతున్న ఎండీ జహంగీర్

ధాన్యాన్ని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్