నుమోనియా కేసుల వ్యాప్తిపై చైనా కీలక ప్రకటన

Sudden Fall In China Respiratory Illness Cases - Sakshi

బీజింగ్‌: చైనాలో ఇటీవల నమోదైన శ్వాససంబంధ అనారోగ్య కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. చిన్నపిల్లలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందిన ఈ నుమోనియా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందన ఆ దేశ వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.‘దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో నుమోనియా కేసులు రావడం ఒక్కసారిగా తగ్గిపోయింది’అని చైనా నేషనల్‌ హెల్త్ కమిషన్‌ చీఫ్‌ మీ ఫెంగ్‌ మీడియాకు తెలిపారు.

నుమోనియా కేసుల నమోదు ఒక్కసారిగా పడిపోయిందని చైనా వెల్లడించడకంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. కొవిడ్‌ భయాలు ఇంకా తొలగిపోని నేపథ్యంలో చైనాలో శ్వాససంబంధిత అనారోగ్య కేసులు మళ్లీ వ్యాప్తి చెందుతున్నాయన్న వార్తలు రావడంతో అన్ని దేశాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. భారత్‌లోనూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఈ విషయంలో ముందు జాగ్రత్తగా అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే.    

కాగా, దేశంలో నుమోనియా తరహా శ్వాసకోశ అనారోగ్య కేసుల నమోదు ఒక్కసారిగా పెరుగుతోందని గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు చైనా తెలిపింది. అయితే కేసుల నమోదుకు కొత్త వైరస్ కారణం కాదని వెల్లడించింది.కేసుల వ్యాప్తి వేగంగా ఉండటానికి కొవిడ్‌ ఆంక్షలు ఎత్తివేయడమే కారణమని డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది.

ఇదీచదవండి..దాడులతో చెలరేగిన ఇజ్రాయెల్‌

Read latest World News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top