న్యూస్‌రీల్
కుట్రలు.. కుతంత్రాలు
కోడ్ ఉల్లంఘనలు
జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. పలు ప్రాంతాల్లో యథేచ్ఛగా ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం ప్రచార బ్యానర్లు కనిపిస్తున్నాయి. 8లో u
గురువారం శ్రీ 19 శ్రీ నవంబర్ శ్రీ 2026
సాక్షి, భీమవరం: భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి ఓటమి భయం పట్టుకుంది. ఒక పక్క రెబల్స్ బెడద, మరోపక్క వార్డుల పంపకాల్లో మిత్రపక్షాల మధ్య విభేదాలు, పరిషత్ ఎన్నికల్లో ప్రతికూలత కూటమి నేతలకు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వైఎస్సార్సీపీ నుంచి ఎక్కడికక్కడ గట్టిపోటీ ఉండటంతో ఏదోవిధంగా ఏకగ్రీవాల కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఇంటి పోరుతో ఇరకాటం
వార్డుల పంపకాల నుంచి కేటాయింపుల వరకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల భేదాభిప్రాయాలు ఎక్కువగానే ఉన్నాయి. నాలుగు మున్సిపాల్టీల్లో స్వపక్షంలో రెబల్స్‌కు తోడు ఒక పార్టీకి కేటాయించుకున్న వార్డులో మరో పార్టీకి చెందిన వారు నామినేషన్లు వేసిన పరిస్థితి. భీమవరంలో బీజేపీకి జరిగిన అన్యాయంపై కేంద్ర మంత్రి స్వయంగా అసహనం వ్యక్తం చేశారు. ‘మేం చూసుకుంటాం.. మీకు సముచిత స్థానం కల్పిస్తాం’ అంటూ ఇన్చార్జి మంత్రి, జిల్లాకు చెందిన మంత్రి, కూటమి ఎమ్మెల్యేలు అసమ్మతివాదుల్ని బుజ్జగించేందుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని కూటమి వర్గాలు చర్చించుకుంటున్నాయి. తగ్గేది లేదంటూ నాలుగు మున్సిపాల్టీల్లో కొందరు రెబల్స్ పోటీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
‘పరిషత్’ ఫలితాల భయం
ఎన్ని పన్నాగాలు పన్నినా, రూ.కోట్లు ఖర్చుపెట్టి ఓటర్లకు ప్రలోభాల ఎరవేసినా జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ఫలితాలు కూటమికి నిరాశను మిగిల్చాయి. అధికార బలంతో ఫలితాలను తారుమా రు చేసినా చావుతప్పి కన్నులొట్టపోయిన చందాన చాలాచోట్ల బొటాబొటీ విజయాలతో సరిపెట్టుకుంది. తాడేపల్లిగూడెం రూరల్, పెంటపాడు, యలమంచిలి, నరసాపురం రూరల్ తదితర జెడ్పీటీసీ స్థానాల్లో గత అసెంబ్లీ ఫలితాలతో పోలిస్తే పరిషత్ పోరులో కూటమి ఆధిక్యత గణనీయంగా తగ్గడం స్పష్టంగా కనిపించింది. ఆ మేరకు వైఎస్సార్సీపీకి పోలింగ్‌శాతం పెరగడం కూటమి వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.
మలివిడత పురపోరు కీలక ఘట్టానికి చేరుకుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తోంది. అనంతరం పోటీలోని అభ్యర్థుల వివరాలను అధికారులు వెల్లడిస్తారు. నిర్ణీత సమయంలోగా వైఎస్సార్సీపీ నుంచి పోటీలో నిలిచిన వారిలో వీలైనంత మందిని ఉపసంహరణ చేయించి పోటీలేకుండా చేసుకోవాలన్న ఆలోచనలో కూటమి నేత లు కుట్ర రాజకీయాలకు తెరలేపారు. ఉపసంహరించుకోవాలంటూ తెలిసిన వారు, మధ్యవర్తుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. వ్యాపారాలు జరగనివ్వమంటూ, ఇళ్లు ఖాళీ చేయిస్తామంటూ. ఉద్యోగాలు తీయిస్తామంటూ పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి నేతలు ఎన్ని రకాలుగా కుట్రలు, కుతంత్రాలు చేసినా వైఎస్సార్సీపీ అభ్యర్థులు తలొగ్గకుండా ప్రజాక్షేత్రంలో ముందుకు దూసుకువెళుతున్నారు.
మీ క్యాండిడేట్ నామినేషన్ విత్‌డ్రా చేసుకోమ్మని చెప్పండి. లేకపోతే ఏం చేయాలో మాకు తెలుసు.
– భీమవరంలో అభ్యర్థి
అనుచరులతో కూటమి నేత
కూటమికి వ్యతిరేకంగా మీరు పోటీ నుంచి తప్పుకోకపోతే మా ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోండి.
– తణుకులో ఓ అభ్యర్థికి
ఇంటి యజమానికి బెదిరింపు
అధికారం మా చేతుల్లో ఉంది. మాకు ఆపోజిట్‌గా పోటీచేసి మీరు వ్యాపారాలు ఎలా చేస్తారో మేమూ చూస్తాం. అర్జెటుగా నామినేషన్ విత్‌డ్రా చేసుకోండి.
– తాడేపల్లిగూడెంలో
ఓ అభ్యర్థికి కూటమి నేత హెచ్చరిక
వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మీరు వేసిన నామినేషన్
విత్‌డ్రా చేసుకోకుంటే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం.
– తణుకులో ప్రైవేట్ ఉద్యోగి అయిన అభ్యర్థికి
మేనేజ్మెంట్ నుంచి బెదిరింపు
దౌర్జన్యకాండ
వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్ల విత్‌డ్రాలకు ఒత్తిళ్లు
కూటమిలో ఓటమి గుబులు
వెంటాడుతున్న రెబల్స్, ప్రభుత్వ వ్యతిరేకత
బెదిరింపులకు లొంగని వైఎస్సార్సీపీ అభ్యర్థులు
నేటితో ముగుస్తున్న ఉపసంహరణ గడువు


