భీమవరం.. చెత్తశుద్ధి శూన్యం | - | Sakshi
Sakshi News home page

భీమవరం.. చెత్తశుద్ధి శూన్యం

Nov 19 2026 12:37 PM | Updated on Nov 19 2026 12:37 PM

భీమవరం: భీమవరం పట్టణంలో డంపింగ్‌యార్డు సమస్యను పరిష్కరిస్తామని గొప్పగా ప్రచారం చేసిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, దానిపై దృష్టి పెట్టకపోవడం పట్టణ ప్రజల్లో చర్చనీయాంశమైంది. జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందిన ఈ పట్టణంలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో డంపింగ్‌యార్డు సమస్యను ప్రజలు ప్రధానంగా లేవనెత్తుతున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సమస్య పరిష్కారానికి కోట్లాది రూపాయల విలువైన 6 ఎకరాల భూమిని తాడేరు గ్రామంలో సేకరించారు. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినా దీనిపై దృష్టి పెట్టలేదని, మళ్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజల వద్దకు ఎలా వస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

యనమదుర్రు డ్రెయిన్‌కు ముప్పు

వైఎస్‌ జగన్‌ హయాంలో తాడేరు, చినఅమిరం, రాయలం, కొవ్వాడ అన్నవరం గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది దీనిపై కోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ కొంతకాలం పెండింగ్‌లో పడింది. తాజాగా కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ నాలుగు గ్రామాలను పట్టణంలో విలీనం చేసి, మొత్తం 52 వార్డులుగా విభజించారు. ప్రస్తుతం భీమవరంలో రోజూ దాదాపు 80 టన్నుల చెత్త సేకరిస్తున్నారు. దీనిని పట్టణానికి దూరంగా ప్రత్యేక డంపింగ్‌యార్డుకు చేరవేయాల్సి ఉండగా, సరైన వసతి లేక పట్టణ నడిబొడ్డున ప్రవహిస్తున్న యనమదుర్రు డ్రెయిన్‌ గట్టుపైనే పడేస్తున్నారు. మున్సిపాలిటీకి చెందిన 90 మంది పర్మినెంట్‌, మరో 270 మంది అవుట్‌సోర్సింగ్‌ పారిశుద్ధ్య కార్మికులు సేకరిస్తున్న ఈ చెత్తనంతా డీఎన్‌ఆర్‌ కాలేజీ సమీపంలోని యనమదుర్రు డ్రెయిన్‌ గట్టుపై వేసి తగలబెడుతుండటంతో, వచ్చే పొగ కారణంగా ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చెత్తను డంపింగ్‌ చేయడం వల్ల డ్రెయిన్‌ కుచించుకుపోయి మురుగునీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఫలితంగా భారీ వర్షాలు, వరదల సమయంలో డ్రెయిన్‌ పొంగి పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి.

కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం

గతంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన పవన్‌కల్యాణ్‌ డ్రెయిన్‌ గట్టుపై ఉన్న డంపింగ్‌ యార్డును చూసి తక్షణమే శాశ్వత డంపింగ్‌యార్డు ఏర్పాటు చే స్తామని ప్రకటించారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తదితరులు కూడా సత్వర చర్యలు చేపడతామని హామీలు గుప్పించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు శూన్యమని ప్రజలు మండిపడుతున్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమికి పరీక్ష

వైఎస్‌ జగన్‌ హయాంలో సేకరించిన భూమిని సైతం రెండేళ్లకుపైగా వినియోగంలోకి తీసుకురాలేకపోయిన కూటమి ప్రజాప్రతినిధులు, పట్టణాన్ని అభివృద్ధి చేస్తామంటే నమ్మేదెలా అని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రధాన సమస్యకే పరిష్కారం చూ పలేని నాయకులు ఇతర మౌలిక వసతులను ఎలా కల్పిస్తారనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు కూటమి పార్టీలను ఏ విధంగా విశ్వసిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రధాన సమస్యగా డంపింగ్‌ యార్డు

పట్టించుకోని కూటమి ప్రభుత్వం

గత ప్రభుత్వంలో ఆరు ఎకరాలు కొనుగోలు

సమస్యను పరిష్కరిస్తామంటున్న వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement