సర్పంచ్‌లకు 77.. వార్డు మెంబర్లకు 234 | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌లకు 77.. వార్డు మెంబర్లకు 234

Nov 19 2026 12:37 PM | Updated on Nov 19 2026 12:37 PM

సర్పంచ్‌లకు 77.. వార్డు మెంబర్లకు 234

రెండో విడత పంచాయతీలకు నామినేషన్లు

భీమవరం: జిల్లాలో రెండో విడత ఆరు మండలాల్లో నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలకు తొలిరోజు బుధవారం నామినేషన్ల స్వీకరణలో 121 పంచాయతీలకు 77 సర్పంచ్‌, 234 వార్డు మెంబర్ల నామినేషన్లు దాఖలయ్యాయి. భీమవరం రెవిన్యూ డివిజన్‌ పరిధిలోని గణపవరం, తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అత్తిలి, ఇరగవరం, పెంటపాడు, తణుకు, తాడేపల్లిగూడెం మండలాల్లో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. గణపవరం మండలం సరిపల్లిలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జేసీ కేఆర్‌ కల్పశ్రీ పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో ఏర్పాట్లను, ఎన్నికల విధుల నిర్వహణ తీరును పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జేసీ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించారు. అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని, సూచనలను స్పష్టంగా అందించాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, ప్రతి అంశంలో పారదర్శకత పాటిస్తూ నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement