పరివర్తనతో జీవించాలి | - | Sakshi
Sakshi News home page

పరివర్తనతో జీవించాలి

Nov 19 2026 12:37 PM | Updated on Nov 19 2026 12:37 PM

పరివర్తనతో జీవించాలి నామినేషన్ల స్వీకరణకు పక్కా ఏర్పాట్లు క్యూఆర్‌ కోడ్‌తో ఎరువుల కొనుగోలు జెడ్పీ చైర్మన్‌ ఎన్నికకు ఏర్పాట్లు

భీమవరం: నేరారోపణపై జైలుకు వచ్చిన మద్దాయిలు సత్ప్రవర్తనతో బయటకు వెళ్లి పరివర్తనతో జీవించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌) ఎన్‌.శ్రీలక్ష్మి అన్నారు. బుధవారం పట్టణంలోని స్పెషల్‌ సబ్‌ జైలును ఆమె సందర్శించి ముద్దాయిలతో మాట్లాడారు. బెయిలు మంజూరైన ముద్దాయిలు కోర్టుకు పూచీకత్తు సమర్పిస్తే విడుదలకు ఉత్తర్వులు ఇస్తారన్నారు. ఉచిత న్యాయ సహాయానికి న్యాయవాది, పా రా లీగల్‌ వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. అనంతరం ఆమె రిజిస్టర్లను తని ఖీ చేసి ముద్దాయిలకు అందించే భోజనాన్ని రుచి చూశారు. జైలు సూపరింటెండెంట్‌ వెంకటగిరి, ప్యానల్‌ న్యాయవాదులు భాగ్యశ్రీ లక్ష్మి, అంబేడ్కర్‌, వెంకటరమణ, ఉమ, ఉష, పద్మ, పారా లీగల్‌ వలంటీర్లు పాల్గొన్నారు.

అత్తిలి: ఎన్నికల నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా నామినేషన్ల స్వీకరణ చేపట్టాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి ఆదేశించారు. రెండో విడత పంచాయతీల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను బుధవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అత్తిలి పంచాయతీ ప్రధాన కార్యాలయం, కంచుమర్రు పంచాయతీలో నామినేషన్‌ కేంద్రాలను ఆమె సందర్శించారు. అధికారులకు ఆమె సూచనలు ఇచ్చారు. అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. డీపీఓ పి.విజయభాస్కర్‌, ఎంపీడీఓ అన్నపూర్ణేశ్వరి, తహసీల్దార్‌ పద్మావతి, ఈఓఆర్డీ సత్యనారాయణ పాల్గొన్నారు.

కాళ్ల: మండలంలోని బొండాడలో ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ ఎరువుల బుకింగ్‌, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఎరువుల కొనుగోలు ప్రక్రియను జిల్లా వ్యవసాయ అధికారి గెడ్డం సునీత, సహాయ వ్యవసాయ సంచాలకుడు పి.జీవన్‌ ప్రతాప్‌, మండల వ్యవసాయ అధికారి పి.రమేష్‌ నాయుడు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎరువుల పంపిణీ ప్రక్రియను తనిఖీ చేసి, ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ విధానంలో ఎరువుల బుకింగ్‌ క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ ద్వారా ఎరువుల కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించారు. ఎరువుల బుకింగ్‌ కొనుగోలు ప్రక్రియలో నిబంధనలు పాటించాలని సూచించారు. రైతులకు సూచనలు, సలహాలు అందించారు.

భీమవరం: జిల్లాపరిషత్‌ చైర్మన్‌ ఎన్నికకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శుక్రవారం భీమవరం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించే కో–ఆప్షన్‌ సభ్యులు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలకు సంబంధించి పాత ఆర్టీసీ బస్టాండ్‌ ఏరియాలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి నేతృత్వంలో ఉదయం 10 గంటలలోపు కో–ఆప్షన్‌ సభ్యుల నామినేషన్స్‌ స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలలోపు నామినేషన్స్‌ పరిశీలన, 12 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటన, మధ్యాహ్నం 1 గంటలోపు నామినేషన్స్‌ ఉపసంహరణకు అవకాశముంటుంది. అనంతరం కో–ఆప్షన్‌ సభ్యుల ప్రకటన, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తారు. జిల్లాలోని 20 మంది జెడ్పీటీసీ సభ్యులు, కో–ఆప్షన్‌ సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు. అనంతరం జెడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికై న చైర్మన్‌, వైస్‌ చైర్మన్స్‌తో ప్రమాణ స్వీకారం ఉంటుందని జెడ్పీ సీఈఓ జి.రమణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement