డంపింగ్‌ యార్డు వైఎస్సార్‌సీపీకే సాధ్యం | - | Sakshi
Sakshi News home page

డంపింగ్‌ యార్డు వైఎస్సార్‌సీపీకే సాధ్యం

Nov 19 2026 12:37 PM | Updated on Nov 19 2026 12:37 PM

డంపింగ్‌ యార్డు వైఎస్సార్‌సీపీకే సాధ్యం ఆరెకరాలు సేకరించినా.. పట్టణ ప్రజలను పట్టిపీడిస్తూ.. ●

పట్టణంలో అపరిష్కృతంగా ఉన్న డంపింగ్‌యార్డు ఏర్పాటు వైఎస్సార్‌సీపీతోనే సాధ్యం. పట్టణంలో ప్రధాన సమస్యను ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండగా సేకరించిన డంపింగ్‌ యార్డు భూమిని నేను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికై న అనతి కాలంలోనే వినియోగంలోనికి తీసుకువస్తాను.

– యాదాల వెంకట మాధవీలత,

వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి, భీమవరం

మున్సిపల్‌ చైర్మన్‌గా టీడీపీకి చెందిన పలువురు పనిచేసినా డంపింగ్‌ యార్డు సమస్యను పరిష్కరించలేకపోయారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండగా స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు డంపింగ్‌ యార్డు సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే ఆరెకరాల భూమిని కొనుగోలు చేయించారు. అయితే ప్రభుత్వం మారడంతో కూటమి నాయకులు గాలికి వదిలివేశారు.

– కామన నాగేశ్వరరావు,

న్యాయవాది, మున్సిల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌, భీమవరం

పట్టణ ప్రజలను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య డంపింగ్‌ యార్డే. పట్టణంలో సేకరించిన చెత్తనంతా యనమదుర్రు డ్రెయిన్‌ గట్టుపైనే వేయడంతో డ్రెయిన్‌ కుచించుకుపోయి మురుగునీటి ప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పట్టణం నడిబొడ్డునే చెత్త వేయడం వల్ల దోమలు పెరిగిపోవడంతో పాటు దుర్గంధం వెదజల్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

– గాదిరాజు రామరాజు,

వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు, భీమవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement