మమ్మల్ని ఏమార్చొద్దు.. కాపు రిజర్వేషన్లు ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

మమ్మల్ని ఏమార్చొద్దు.. కాపు రిజర్వేషన్లు ఇవ్వండి

Sep 13 2026 9:16 AM | Updated on Sep 13 2026 9:16 AM

ద్వారకాతిరుమల: కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గతంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకోవాలని కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి (కేఆర్పీఎస్‌) రాష్ట్ర గౌరవ చైర్మన్‌, టీబీకే జేఏసీ సౌత్‌ ఇండియా కన్వీనర్‌ దా సరి రాము డిమాండ్‌ చేశారు. స్థానిక కాపు కల్యాణ మండపంలో కేఆర్పీఎస్‌–కాపునాడు పెద్దల ఆ ధ్వర్యంలో శనివారం కాపుల చైతన్య సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాము మాట్లాడుతూ గతంలో చంద్రబాబు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని, అవకాశం ఉండి చేయగలిగితే చేయండి.. కానీ మమ్మల్ని ఏమార్చొద్దు అని ఆయన కోరారు.

హామీలు అమలు చేయాలి

అసెంబ్లీలో తీర్మానం చేసిన 5 శాతం బీసీ–ఎఫ్‌ కేటగిరీ రిజర్వేషన్లను వీలైనంత త్వరగా అమలు చే యాలని రాము కోరారు. కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ.3 వేల కోట్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అన్ని కులాలకూ వర్తించే సంక్షేమ పథకాలు, పెన్షన్లు, అమ్మఒడి తదితర పథకాల్లో కాపులకు అందిన మొత్తాలను లెక్కించి ‘కాపులకు ఇన్ని వేల కోట్లు ఇచ్చాం’ అని ప్ర భుత్వం చెప్పడం సరికాదన్నారు. ప్రస్తుతం కాపులు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను వినియోగించుకుంటున్నారని, అయితే నిబంధనల ప్రకారం అర్హత లేని ఆస్తిపరులకు కూడా ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయని ఆరోపించారు. అలాగే కాపు జనాభా రాష్ట్రంలో సుమారు 18 నుంచి 20 శాతానికి పైగా ఉందని, ఈ నిష్పత్తిన ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో కాపులకు న్యాయం జరగడం లేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం కాపులకు ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

నెలాఖరులో విజయవాడలో ధర్నా

కాపు రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్‌కు నిధులు, ఇతర సమస్యలపై నెలాఖరులో విజయవాడ ధర్నాచౌక్‌లో కాపు సంఘాల పెద్దలతో భారీ ధర్నా నిర్వహించనున్నట్టు రాము చెప్పారు. అనంతరం చంద్రబాబును బహిరంగ చర్చకు రావాలంటూ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అధ్యక్షుడు రావి శ్రీనివాస్‌, రాష్ట్ర చైర్మన్‌ కాజా సత్యనారాయణ, కో–కన్వీనర్లు కాకిలేటి హరనాథ్‌, వలవల శ్రీధర్‌ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కాపునాడు అధ్యక్షుడు చినమిల్లి వెంకటరాయుడు, న్యాయవాదులు మాకా శ్రీనివాసరావు, కన్నా రజని, ఉమ్మడి విశాఖ జిల్లా కాపు నేత తోట రాజీవ్‌, కాపు జేఏసీ నాయకుడు ఆమంచి సోములు, రాష్ట్ర కాపు జేఏసీ నాయకుడు తోట రామకృష్ణ, కాపు నేతలు పల్నాటి బుజ్జి, పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్‌, రుద్ర శివాజీ, పుప్పాల మురళీ, పెద్దిరెడ్డి నాగేశ్వరరావు, ఉక్కుర్తి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

కాపుల చైతన్య సదస్సులో వక్తల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement