భీమవరం: జిల్లాలోని మద్యం షాపులను ఏడాదిపాటు రెన్యువల్ చేస్తున్నట్టు జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి బి.సుబ్బారావు తెలిపారు. శనివారం భీమవరంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 193 మద్యం షాపులకుగా ను 175 ఓపెన్ కేటగిరీలో, 18 కల్లుగీత కార్మి కులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గతంలో ఇచ్చిన లైసెన్స్ గడువు ఈనెల 30తో ముగుస్తున్నందున ప్రభుత్వం మరో ఏడాది లైసెన్స్ పొడిగించిందన్నారు. రెన్యువల్ ఫీజును 38 శాతం చెల్లిస్తే ప్రస్తుత లైసెన్స్‌దారుడు రానున్న ఎకై ్సజ్ లీజుకు అర్హులని పేర్కొన్నారు. ఈ ఫీజును నాలుగు వాయిదాల్లో చెల్లించవచ్చన్నారు. ప్రస్తుతమున్న లైసెన్స్ షాపులకు పర్మి ట్ రూమ్ ఫీజుతోనే రెన్యువల్ చేస్తారన్నారు. మద్యం తయారీ దగ్గర నుంచి వినియోగదారుడికి చేరే వరకు ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టం అమలుచేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత లైసెన్స్‌దారులు ఈనెల 21లోపు రెన్యువల్ చేసుకోకుంటే ఆయా షాపులకు రీ నోటిఫికేషన్ ఇస్తామని, అలాగే ఎకై ్సజ్ నిబంధనల ప్రకారం మద్యం అమ్మకాలు నిర్వహించకుంటే రూ.10 లక్షల వరకు ఫెనాల్టీ విధిస్తామని వివరించారు.
భీమవరం : జిల్లాలో ప్రజల ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ఈనెల 16, 17 తేదీల్లో జిల్లాలోని ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇ స్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గో పాలన్ తెలిపారు. పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో శనివారం ఆన్‌లైన్‌లో నిర్వహించగా వివరాలను విలేకరులకు వెల్లడించారు. జి ల్లాలోని ప్రధాన ప్రజాసమస్యలను చర్చించి వాటినీ స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్ర ధానంగా పింఛన్ల దరఖాస్తు గడువు పెంపు, ఇళ్ల పట్టాలు ఉచిత రిజిస్ట్రేషన్, ఇళ్ల స్థలాల కేటాయింపు, ప్రభుత్వ కాలనీల్లో మౌలిక వసతుల కల్పన వంటి సమస్యలను తెలియజేస్తామన్నారు. కవురు పెద్దిరాజు, బి.వాసుదేవరావు పాల్గొన్నారు.
‘పశ్చిమ’వాసులకు స్వల్పగాయాలు
అమలాపురం రూరల్: కోనసీమ జిల్లా అమలాపురం మండలం భట్నవిల్లిలో జాతీయ రహదారిపై శనివారం రాత్రి కాకినాడ వైపు నుంచి పశ్చిమగోదావరి జిల్లా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. స్థానిక వనువులమ్మ గుడిసెంటర్ వద్ద టర్నింగ్ పాయింట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతింది. కాగా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని స్థానికుల సురక్షితంగా బయట తీశారు. వారికి స్వల్ప గాయాలు కాగా స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు.
ప్రత్తిపాడు : దుండగులు చేపల చెరువు య జమాని గొంతు కోసి హత్య చేసి, బంగారు వస్తువులు, నగదు దోచుకుపోయిన ఘటన శనివారం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని టి.రాయవరంలో జరిగింది. పో లీసులు, స్థానికుల కథనం మేరకు గ్రామానికి చెందిన ఓ చెరువును ఏలూరు జిల్లా పైడిచింతపర్రుకి చెందిన మోరి నరసింహారావు (70) లీజుకు తీసుకుని నాలుగేళ్లుగా చేపలు పెంచుతున్నాడు. చెరువు వద్ద మకాంలో కొవ్వాడలంకకి చెందిన వితంతువైన తన కుమార్తె బలే నాగలక్ష్మితో కలిసి జీవిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం పెన్షన్ నిమిత్తం కుమార్తె కొవ్వాడలంక వెళ్లింది. శుక్రవారం సాయంత్రం చేపల చెరువు మకానికి సమీపంలో స్నేహితులు గొర్ల రాంబాబు, చిరికే అప్పారావుతో కలిసి ఆయన టీ తాగారు. ఆ రాత్రి వేళ ఇద్దరు లేదా ముగ్గురు అగంతకులు వచ్చారని, వారితో జరిగిన ఘర్షణలో పదునైన ఆ యుధంతో నరసింహారావు మెడ కోసి, హ త్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. నాగలక్ష్మి గదిలోని బీరువా పగలగొట్టి 10 గ్రాముల బంగారు వస్తువులు, రూ.2 లక్షల నగదు దో చుకుపోయారు. స్నేహితులు ఉదయం వచ్చి పిలిచినా పలకకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా అతడు విగతజీవుడై పడి ఉన్నాడు.


