తణుకు అర్బన్ : 44వ ఏపీ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీలు తణుకు శ్రీ చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో శనివారం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి 30 నుంచి 80 ఏళ్లలోపు 450 మంది క్రీడాకారులు హాజరయ్యారని, రన్నింగ్, లాంగ్‌జంప్, షాట్‌పుట్‌లో పోటీలు నిర్వహించి విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందించినట్టు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బీడీ నాగేశ్వరరావు, సంకు సూర్యనారాయణ తెలిపారు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారిని చైన్నెలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. తణుకులో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బసవ రామకృష్ణ అన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు, బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కేఆర్ చక్రధరరావు, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి పోటీలను ప్రారంభించారు. భూపతిరాజు శ్రీరామరాజు (ఖండవల్లి) క్రీడాకారులకు అల్పాహారం, భోజన వసతి కల్పించారు.


