శ్రీవారి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం

Aug 17 2026 7:29 AM | Updated on Aug 17 2026 7:29 AM

శ్రీవారి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం

ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి క్షేత్రానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ప్రారంభం కావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తుల రద్దీతో అనివెట్టి మండపాలు, దర్శనం క్యూ లైన్లు, క్యూ కాంప్లెక్స్‌, కల్యాణకట్ట తదితర ప్రాంతాలు కిక్కిరిశాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. క్షేత్రంలో సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement