తాడేపల్లిగూడెం: పంటల్లో దిగుబడిని తగ్గించే, శ్వాసకోశ, చర్మ సంబంధ వ్యాధులకు కారణమయ్యే వయ్యారిభామ మొక్క ప్రమాదకరమని వెంకట్రామన్నగూడెం కేవీకేలో ఆదివారం రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కేవీకే సైంటిస్టు దేవీవరప్రసాదరెడ్డి అన్నారు. పార్ధీనియం మొక్కగా పిలిచే వయ్యారిభామ మొక్క వేగంగా వ్యాప్తి చెందుతూ పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా , మనుషులు. పశువుల్లో అలర్జీలు, చర్మ సంబంధిత సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు కలిగే ప్రమాదాలు ఉన్నాయన్నారు. పార్ధీనియం విత్తనాలు విస్తృతంగా వ్యాప్తి చెంది భవిష్యత్‌లో కలుపు నియంత్రణ మరింత కష్ట తరమవుతుందన్నారు. ఈ మొక్కలను చిన్నదశలోనే పీకేయడం, పుష్పించే ముందు తొలగించడం, కలుపు నివారణ చర్యలు తీసుకోవడం, పొలాలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు.
సీనియర్ శాస్త్రవేత్త దేవీవరప్రసాదరెడ్డి


