ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రానున్న పంచాయతీ ఎన్నికల కోసం జి ల్లాలోని అన్ని గ్రా మ పంచాయతీల్లో ఈ ఏడాది జనవరి 1ని అర్హతగా పరిగణించి ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలను నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈనెల 21లోపు పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా రూపొందించి, 23లోపు ప్రచురిస్తామన్నారు. జాబితాపై అభ్యంతరాలు, విజ్ఞప్తులను 26లోపు స్వీకరించి, 29న ఆమోదించిన అనంతరం 31న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురిస్తామన్నారు. సుమారు 600 మంది ఓటర్లకు ఒక ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిఉంటుందన్నారు. ఓటర్ల సంఖ్య 1,300 కంటే ఎక్కువగా ఉంటే, మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఏ,బీ,సీలుగా విభజించాలన్నారు. సాధారణంగా ఏ ఓటరు కూడా ఓటు వేయడానికి రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా చూడాలన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను సోమవారం భీమవరం కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహిస్తామన్నారు. ప్రజలు నేరుగా వెబ్‌సైట్, టోల్‌ఫ్రీ 1100 ద్వారా కూడా అర్జీలు సమర్పించవచ్చని సూచించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారిని కేంద్రాలకు తీసుకురాకుండా, వారి ప్రతినిధుల ద్వారా అర్జీలు అందజేయవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.
తణుకు అర్బన్: ‘పశువైద్యం.. పూజ్యం’ శీర్షికన సాక్షిలో ఈనెల 15న ప్రచురించిన కథనానికి తణుకు పశు వైద్యశాల అధికారులు స్పందించారు. వైద్యులు, సిబ్బంది కొరత ఉండడం వాస్తవమేనని, పశువైద్య సేవల్లో ఎటువంటి లోపాలు లేకుండా రైతులకు సేవలందిస్తున్న ట్టు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వి.ప్రసాద్ తెలిపారు. ఉన్నతాధికారుల సహకారంతో వైద్యులు, పారా వెటర్నరీ సిబ్బంది, అటెండర్లను డిప్యుటేషన్‌పై తీసుకున్నామన్నారు. మందులు అందుబాటులో ఉన్నాయని, అత్యవసర మందులు మాత్రమే బయట మందుల దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారని, మత్తు మెషీన్ సరఫరాకు కలెక్టర్‌కు ప్రతిపాదన పంపినట్టువివరించారు. మందుల బడ్జెట్ కూడా ప్రతి ఏడాది పెరుగుతుందని చెప్పారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని, ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డి మాండ్ చేస్తూ ఈనెల 18న ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలుపనున్నట్టు ఏలూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తొర్లపాటి బా బు, రెడ్డి శ్రీనివాస్ డాంగే తెలిపారు.


