వీరవాసరం: సర్దార్ గౌతు లచ్చన్న ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని శాసనమండలి సభ్యుడు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడు కవురు శ్రీనివాస్ అన్నారు.. మండలంలోని నౌడూరు జంక్షన్‌లో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప జాతి నాయకుడు గౌతు లచ్చన్న అని కొనియాడారు. ముందుగా ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మాజీ ఎంపీపీ వీరవల్లి చంద్రశేఖర్, ఎంపీటీసీ కడలి నెహ్రూ, మాజీ సర్పంచ్ కౌరు భాస్కరరావు, కాండ్రేగుల శ్రీనివాస్, కడలి శ్రీరాములు, జుత్తిగ శ్రీనివాస్, కోటి, కోడి నరసింహ, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు.
భీమవరం : పట్టణంలోని డీఎన్నార్, ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆదివారం నిర్వహించిన టెట్ పరీక్షకు 39 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని డీఈఓ ఓవీఎస్ అనిల్‌కుమార్ తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరిగిన పరీక్షలకు 451 మందికి 412 మంది హాజరయ్యారన్నారు.


