ముదినేపల్లి(కై కలూరు): జిల్లాలో ప్రసిద్ధి చెందిన శింగరాయపాలెం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో గత 140 రోజులకు చెందిన హుండీ కానుకలను ఏలూరు జిల్లా సహాయ కమిషనర్ కూచిపూడి శ్రీనివాసు ఆధ్వర్యంలో శుక్రవారం లెక్కించారు. ఆలయ హుండీల ద్వారా రూ. 16,12,494, అన్నదాన హుండీల ద్వారా రూ. 1,26,857 కలిపి మొత్తం రూ. 17,39,351 ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగా శ్రీదేవి తెలిపారు. వీటితో పాటు 15 గ్రాముల బంగారం, 420 గ్రాముల వెండిని భక్తులు సమర్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొంగు రవికుమార్, పాలకమండలి సభ్యులు నీలం శివరమేష్, పరస కృష్ణ, బూరుబోయిన సోవమ్మ తదితరులు పాల్గొన్నారు.


