ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంపై బుధవారం అమావాస్య ప్రభావం కనిపించింది. నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడే ఆలయ ప్రాంగణం నామమాత్రంగా వచ్చిన భక్తులతో సందడి లేకుండా కనిపించింది. దర్శన క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్, అనివెట్టి మండపాలు, ప్రసాదం టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు స్వల్ప సంఖ్యలో భక్తులు కనిపించారు. సాధారణ రోజులతో పోలిస్తే భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. మధ్యాహ్నం తర్వాత ఆలయ పరిసరాలు మరింత నిర్మానుష్యంగా మారాయి.
భీమవరం: జిల్లాలో బుధవారం నిర్వహించిన టెట్ పరీక్షకు 416 మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఓవీఎస్ అనిల్‌కుమార్ సోమవారం చెప్పారు. పరీక్షలకు 450 మంది హాజరుకావల్సివుండగా 416 మంది హాజరయ్యారని తెలిపారు.


