పెనుగొండ : అమరావతి చాంపియన్‌షిప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఆచంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్ధులు ఎంపికై నట్లు పాఠశాల ప్రథానోపాధ్యాయుడు సీహెచ్‌ఎన్‌ఎస్ శ్రీనివాస్ బుధవారం విలేకరులకు తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ముగ్గురు విద్యార్ధులు ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు యుం ఉమామహేశ్వర్, కే దినేష్, ఎం ఉమా వైష్ణవ్ ఎంపిక కాగా, బాలికల విభాగంలో జిల్లాస్థాయి ద్వితీయ స్థానాన్ని వీ శ్రీవల్లి, పి రాజీ, ఏ సహస్ర, బి ప్రియాంక, యు శ్రీలేఖ సాధించారన్నారు. విద్యార్థులను, శిక్షణ నిచ్చిన పీఈటీలు బీఎన్ స్వామి, పి బెనహంలను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బీ కృష్ణమోహన్, రత్నకుమారి పాల్గొన్నారు.
ఉంగుటూరు : నారాయణాపురం మహాత్మాగాంధీ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై ప్రతిభ చాటారు. ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం (బైపీసీ) విద్యార్థి ఎ.రోహిత్ ఏలూరులో జరిగిన జిల్లా స్థాయి ఎంపికల్లో అండర్–17 కబడ్డీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించి, ఏలూరు జిల్లా తరఫున రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అలాగే, సీఈసీ ప్రథమ సంవత్సరం విద్యార్థి టి. శివదుర్గ హాకీ జట్టులో జిల్లా తరఫున ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది. క్రీడల్లో రాణించిన ఈ విద్యార్థులను కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ బీవీ శ్రీనివాసు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందించి హర్షం వ్యక్తం చేశారు.
తణుకు అర్బన్ : దువ్వ గ్రామంలో మద్యం దుకాణం వద్ద ఈనెల 11న తంగెళ్ల రాంబాబు అలియాస్ రాము అనే వ్యక్తిపై బీరు బాటిల్‌తో దాడికి పాల్పడిన గ్రామానికి చెందిన లుకలపు కోటేశ్వరరావు అలియాస్ శివను అరెస్టు చేసినట్లు తణుకు రూరల్ ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపారు. పాత గొడవల నేపథ్యంలో జరిగిన ఈ దాడికి సంబంధించి శివను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు వివరించారు.


