ఆహార భద్రత అధికారుల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఆహార భద్రత అధికారుల తనిఖీ

Aug 13 2026 12:39 AM | Updated on Aug 13 2026 12:39 AM

ఆహార భద్రత అధికారుల తనిఖీ అవాస్తవ కథనాలపై కేసు నమోదు

తాడేపల్లిగూడెం: పట్టణంలోని ఫుడ్‌కోర్టు ప్రాంతంలో బుధవారం జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కొందరు వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ ఏఎస్‌ఆర్‌ రెడ్డి ఆదేశాలననుసరించి జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి పి. పునీత్‌కుమార్‌ ఈ తనిఖీలు చేపట్టారు. ఆహార భద్రత, పరిశుభ్రతతో పాటు స్టాల్స్‌లో హానికరమైన ఫుడ్‌ కలర్స్‌ వాడుతున్నారా లేదా అనే కోణంలో ఆరా తీశారు. స్టాల్స్‌లో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించడంతో పాటు, లైసెన్సులు లేని నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా కొన్ని నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు పునీత్‌కుమార్‌ తెలిపారు.

తాడేపల్లిగూడెం అర్బన్‌ : యూట్యూబ్‌ చానల్‌లో విలేకరిగా పనిచేస్తున్న ఉర్ల వర్ధన్‌ ఆత్మహత్యకు కారకులైన వారిపై తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. పట్టణ ఎస్సై బాదం శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం... తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న పాతకాకుల నాగరాజుపై అవాస్తవాలను ప్రసారం చేసి, బెదిరించి రంగా సురేష్‌, దేవా శివ నగదు వసూలు చేశారని ఫిర్యాదు చేయడంతో స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement