పెనుమంట్ర: పెనుమంట్ర మండలం సత్యవరం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ సీనియర్ నా యకులు ఆదివారం మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఆచంట నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. మాజీ సర్పంచ్ దివంగత చుక్క అప్పారావు సోదరుడు చుక్క శ్రీనివాస్, పుష్పలత దంపతులతో పాటు వారి సోదరులు గౌతమ్‌కుమార్, 14 మంది టీడీపీ సీనియర్ నాయకులు ఆదివారం తూర్పుపాలెం శ్రీరంగనాథరాజును కలిశారు. వారితో పాటు గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గెడ్డం విఘ్నేశ్వరులు, కుక్కల సూర్యనారాయణ, చెల్లబోయిన శ్రీను, కట్ట వెంకటేశ్వర్లు ముప్పిడి మోసే, గుబ్బల రామకృష్ణ, కట్ట మురళి, చొక్కాకుల నాగులు, మంగం మారేస్, ఖండవల్లి సురేష్ మంగం చిన్న వెంకటరావు తదితర నాయకులతో పాటు సుమారు 80 మంది కార్యకర్తలకు శ్రీరంగనాథరాజు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రతి కార్యకర్తకూ సముచిత స్థానం కల్పిస్తున్నామని, అదే స్ఫూర్తితో కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలను కూడా అండగా నిలుస్తామన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ ప్రభు త్వం నెరవేర్చలేని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. మాట తప్పని.. మడం తిప్పని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీరంగనాథరాజుల నా యకత్వంలో వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు చె ప్పారు. పోడూరు జెడ్పీటీసీ గుంటూరు పెద్దిరాజు, మండల పార్టీ అధ్యక్షుడు గూడూరు దేవేంద్రుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు తమనంపూడి పల్లారెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి టి. సూర్య వెంకట గణేష్ రెడ్డి, అయ్యప్పరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గడ్డం ఈశ్వరుడు, సీనియర్ నాయకుడు నల్లమిల్లి ప్రభాకర్ రెడ్డి, జక్కంచెట్టు శ్రీరాములు, పోతిమూడి రామచంద్రరావు, గుబ్బల వీరబ్రహ్మం, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బుర్ర రవికుమార్ తదితరులు ఉన్నారు.


