భీమవరం మండలంలోని కొత్తపూసలమర్రు నుంచి దొంగపిండి వరకు ఆర్‌అండ్‌బీ రోడ్డుపై భారీ గోతులతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఇటుగా స్కూల్ బస్సులు, ఆటోలు, చేపల లోడుతో భారీ లారీలు, వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. భారీ గోతుల్లో వాహనాలు దిగబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. అలాగే ఒళ్లు హూనమై పోతుందని అంటున్నారు. ఈ ప్రాంతంలో మరమ్మతులు చేస్తున్నా మళ్లీ గోతులు పడుతున్నాయని, వర్షం నీరు నిలిచి రోడ్డు మరింత అధ్వానంగా మారుతుందని చెబుతున్నారు. అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
– భీమవరం అర్బన్


