భీమవరం (ప్రకాశంచౌక్): గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. కొమరం భీమ్ చిత్రపటానికి జేసీ కేఆర్ కల్పశ్రీ, కలెక్టరేట్ ఏఓ ఎ.వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డి.పుష్పరాణి, గిరిజన సంక్షేమ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జేసీ సమావేశం నిర్వహించారు. గిరిజన సంస్కతి, సాంప్రదాయాలు, హక్కులు, విద్యా, సామాజిక, ఆర్థిక అభివద్ధి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. గిరిజన విద్యార్థులతో ముచ్చటించారు. జిల్లా ప్రోగ్రామింగ్ మేనేజర్ ఎ.శ్యాం, గిరిజన నాయకులు సాలా మల్లేశ్వరరావు, కుతాడి శ్రీనివాసరావు, మేకల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
తణుకు అర్బన్: అమరావతి జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు సోమవారం తణుకు బాలుర ఉన్న త పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నట్టు ఎంపీడీఓ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభించే పోటీల్లో జి ల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారన్నారు. పోటీలను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభిస్తారని చెప్పారు.


